BMS Nanda Kishore | ఆటో డ్రైవర్లూ.. కనీస ఛార్జీ రూ.50 వసూలు చేయండి: బీఎంఎస్ పిలుపు
BMS Nanda Kishore | ఆటో మీటర్ ఛార్జీల పెంపులో ప్రభుత్వ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని తాము వ్యతరేకిస్తున్నామని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్.నంద కిశోర్ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఆటో డ్రైవర్ కనీస ఛార్జీగా రూ.50 వసూలు చేయాలని పిలుపునిచ్చారు.
BMS Nanda Kishore | త్రినేత్ర న్యూస్: ఆటో మీటర్ ఛార్జీల పెంపులో ప్రభుత్వ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని తాము వ్యతరేకిస్తున్నామని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్.నంద కిశోర్ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఆటో డ్రైవర్ కనీస ఛార్జీగా రూ.50 వసూలు చేయాలని పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్లకు న్యాయమైన మీటర్ ఛార్జీలను నిర్ణయించడంతో పాటు, ఆటో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం వెంటనే సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.పెంటయ్య గౌడ్, బీపీటీఎంఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీధర్ రెడ్డి మాట్లాడారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన ఛార్జీల ప్రకారం మొదటి 1.6 కిలోమీటర్లకు రూ.30, ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.14గా నిర్ణయించే అంశం ముందుకు వచ్చింది. ఈ రేట్లు ఆటో డ్రైవర్ల ప్రస్తుత జీవన వ్యయాలు, ఇంధనం, వాహన నిర్వహణ, బీమా, మరమ్మతులు తదితర ఖర్చులకు తగిన విధంగా లేవు. తెలంగాణలో ఆటో మీటర్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఆటో డ్రైవర్ల సమస్యలు, మీటర్ ఛార్జీల పెంపు తదితర అంశాలపై ఆటో సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు జరిపిన నేపథ్యంలో, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడం సమంజసం కాదు. ఆటో డ్రైవర్లకు సంబంధించిన కీలకమైన ఛార్జీల విషయంలో సంఘాల ప్రతినిధులతో సమగ్రంగా చర్చించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. దీనికి భిన్నంగా వ్యవహరించడం వల్ల వేలాది మంది ఆటో డ్రైవర్లలో తీవ్ర అసంతృప్తి ఉంది.
ఆటో సంఘాల నాయకులను చర్చలకు పిలిచి, వారి అభిప్రాయాలను తీసుకున్నట్లు చూపించి, చివరకు వారి సమ్మతి లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాల్సిన రవాణా శాఖ, వారి జీవనోపాధికి సంబంధించిన కీలకమైన ఛార్జీల విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రభుత్వ ఏకపక్ష ఆటో ఛార్జీల ఉత్తర్వులకు నిరసనగా రేపటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. ప్రభుత్వం వెంటనే సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి, సమగ్ర చర్చలు జరపాలి అని నందకిశోర్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Raashi Khanna | ధర్మన్ కోసం రెమ్యూనరేషన్ డబుల్ చేసిన రాశీఖన్నా
- ●Arms Theft Case | మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీలో విస్తుపోయే విషయాలు..!
- ●Aishwarya Rajesh | గ్లామర్ రూటులో ఐశ్వర్య రాజేష్ - హాట్ ఫొటోలతో షేక్
- ●K Laxman | సేవ్ డెమోక్రసీ కాదు.. సేవ్ డైనాస్టీ మార్చ్ : కే లక్ష్మణ్
- ●Gutka Manufacturing Unit | ఇంట్లో గుట్కా తయారీ కేంద్రం.. గుట్టురట్టు చేసిన పోలీసులు
- ●TG PRC | పీఆర్సీ అమలుపై నీలినీడలు

Raashi Khanna | ధర్మన్ కోసం రెమ్యూనరేషన్ డబుల్ చేసిన రాశీఖన్నా

Arms Theft Case | మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీలో విస్తుపోయే విషయాలు..!

Aishwarya Rajesh | గ్లామర్ రూటులో ఐశ్వర్య రాజేష్ - హాట్ ఫొటోలతో షేక్

K Laxman | సేవ్ డెమోక్రసీ కాదు.. సేవ్ డైనాస్టీ మార్చ్ : కే లక్ష్మణ్






