Ponnam Prabhakar | ఆటో కార్మికులారా! సమ్మె వద్దు.. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నం
Ponnam Prabhakar | ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని.. ఆర్టీసోళ్ల సమస్యలు పరిష్కరించినట్లే ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సమ్మె ద్వారా సమస్యలు పరిష్కారం కావని.. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
- ఆర్టీసోళ్ల సమస్యలు పరిష్కరించినట్టే మీ సమస్యలు పరిష్కరిస్తాం
- రండి.. కూర్చొని మాట్లాడుదాం
- ఆటో చార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తాం
- హుస్నాబాద్ నుంచే విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రజలు ఇబ్బంది పడే పని చేయకండి
- ఆటో కార్మికులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని.. ఆర్టీసోళ్ల సమస్యలు పరిష్కరించినట్లే ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సమ్మె ద్వారా సమస్యలు పరిష్కారం కావని.. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. కమిటీ వేసి అన్ని విధివిధానాలు రూపొందిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో లేకపోవడం వల్ల హుస్నాబాద్ నుంచే మీకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. దయచేసి ప్రజలు ఇబ్బంది పడే పని చేయొద్దని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆటో కార్మికుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు.
డీజిల్,పెట్రోల్ ఆటో లను రేటిరోఫిట్మెంట్ చేసుకోవడానికి రూ.1.50 లక్షలు ఆర్థిక సహాయం చేయడానికి కొత్త పథకం తీసుకొస్తున్నాం. 2015 తర్వాత ఆటో చార్జీలను పెంచలేదు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల ధరలు, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఆటో చార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తాం. కమిటీలో ఆటో కార్మికుల ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులు, సంబంధిత వర్గాలను భాగస్వామ్యం చేసి, అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి న్యాయమైన నిర్ణయం తీసుకుంటాం.
ఆటో కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేబినెట్ ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి అవసరమైన విధివిధానాలను రూపొందించి బోర్డు ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో కార్మికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చే రెట్రోఫిట్మెంట్‌కు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది.
ఎలక్ట్రిక్ ఆటోలకు మారేందుకు ప్రతి ఆటోకు రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వ సహాయం చేసేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. పాత ఆటోను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసుకునే వారికి కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. హైదరాబాద్‌లో దశలవారీగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం.
గ్రామీణ ఆటో కార్మికుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి విధానంతో వారికి మరింత ప్రయోజనం కల్పించవచ్చో ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆటో కార్మికులు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటాం. రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం తదితర సంక్షేమ కార్యక్రమాల్లో అర్హులైన ఆటో కార్మికుల కుటుంబాలకు కూడా ప్రయోజనం కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కారానికి సహకరించాలి అని పొన్నం ప్రభాకర్ కోరారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bhagat Singh | పంజాబ్ ఓటరు జాబితాలో స్వాతంత్య్ర సమరయోధుడి ఫొటో..
- ●Anganwadi Recruitment | అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ ఉద్యోగాలు.. ఆసిఫాబాద్, వికారాబాద్ జిల్లాల్లో 697 ఖాళీలు
- ●Father Funeral | ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను ఆపిన కూతుర్లు..
- ●Strike | సమ్మె బాటలో జూనియర్ డాక్టర్లు.. ఉస్మానియాలో నిలిచిపోనున్న సేవలు
- ●Horoscope | అక్టోబర్ 12 రాశిఫలాలు.. వినూత్న ఆలోచనలు అవసరం!
- ●Kobali Lyrical Song Release | గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ 'రణబాలి' - 'కోబలి' సాంగ్ వచ్చేసింది

Bhagat Singh | పంజాబ్ ఓటరు జాబితాలో స్వాతంత్య్ర సమరయోధుడి ఫొటో..

Anganwadi Recruitment | అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ ఉద్యోగాలు.. ఆసిఫాబాద్, వికారాబాద్ జిల్లాల్లో 697 ఖాళీలు

Father Funeral | ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలను ఆపిన కూతుర్లు..

Strike | సమ్మె బాటలో జూనియర్ డాక్టర్లు.. ఉస్మానియాలో నిలిచిపోనున్న సేవలు





