త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karimnagar | క‌రీంన‌గ‌ర్‌లో భారీ చోరీ.. డ‌మ్మీ తుపాకుల‌తో బెదిరించి 60 తుల బంగారం, రూ.20 ల‌క్ష‌లు ఎత్తుకెళ్లారు

Karimnagar | క‌రీంన‌గ‌ర్‌లోని (Karimnagar) భ‌ర‌త్‌న‌గ‌ర్‌లో భారీ చోరీ (Robbery) జ‌రిగింది. అర్ధ‌రాత్రి డ‌మ్మీ తుపాకుల‌తో (Dummy Pistol) అజ్మ‌ల్ అలీ అనే వ్య‌క్తి ఇంట్లోకి చొర‌బ‌డిన దుండ‌గులు.. వృద్ధ దంప‌తుల‌ను బెదిరించి దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డారు.

G

Telangana | Published On Jul 22, 2026, 7.32 am IST

Karimnagar | క‌రీంన‌గ‌ర్‌లో భారీ చోరీ.. డ‌మ్మీ తుపాకుల‌తో బెదిరించి 60 తుల బంగారం, రూ.20 ల‌క్ష‌లు ఎత్తుకెళ్లారు
Advertisement

Karimnagar | త్రినేత్ర‌.న్యూస్‌: క‌రీంన‌గ‌ర్‌లోని (Karimnagar) భ‌ర‌త్‌న‌గ‌ర్‌లో భారీ చోరీ (Robbery) జ‌రిగింది. అర్ధ‌రాత్రి డ‌మ్మీ తుపాకుల‌తో (Dummy Pistol) అజ్మ‌ల్ అలీ అనే వ్య‌క్తి ఇంట్లోకి చొర‌బ‌డిన దుండ‌గులు.. వృద్ధ దంప‌తుల‌ను బెదిరించి దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డారు. సుమారు 60 తులాల బంగారం (Gold), రూ.20 ల‌క్ష‌ల న‌గ‌దు ఎత్తుకెళ్లారు. పార్కింగ్ చేసి ఉన్న రెండు బైకులను కూడా త‌మ‌తో తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. క్లూస్ టీం స‌హాయంతో ఆధారాలు సేక‌రించారు. దుండ‌గుల‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌త్యేక బృందాలు గాలింపు చేప‌ట్టాయి.

మూడు నెల‌ల క్రితం క‌రీంన‌గ‌ర్‌లో ప‌ట్ట‌ప‌గ‌లే ఓ జ్యువెల్ల‌రీ షాప్‌లో దొంగ‌లు చోరీకి పాల్ప‌డిన విష‌యం తెలిసింది. మే 3న ఉదయం 11గంట‌ల‌కు న‌గ‌రంలోని పీఎంజే జ్యువెల్లరీ దుకాణంలోకి ప్ర‌వేశించిన దుండ‌గులు సిబ్బందిని తుపాకుల‌తో బెదిరించారు. అయితే వారు ఎదురుతిర‌గండంతో కాల్పులు జ‌రిపి.. పెద్ద‌మొత్తంలో బంగారు న‌గ‌లు ఎత్తుకెళ్లారు. ఉద‌యం 11.01 గంట‌ల‌కు షోరూంలోకి చొరబడిన దుండగులు 11.12కి దోపిడీ ముగించుకుని అక్కడి నుంచి పారిపోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement
Advertisement