Grandparents’ Day | తాతయ్యలు.. నానమ్మలతో చిన్నారుల సండే సందడి!
Grandparents' Day | తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలతో చిన్నారుల ఆటపాటలు.. నృత్యాలు, పాటలతో సందడి.. ఆప్యాయతలు, అనుబంధాల మధ్య అర్షా స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌లో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
- అర్షా స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌లో ఘనంగా గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు
Grandparents' Day | తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలతో చిన్నారుల ఆటపాటలు.. నృత్యాలు, పాటలతో సందడి.. ఆప్యాయతలు, అనుబంధాల మధ్య అర్షా స్కూల్ ఆఫ్ లెర్నింగ్‌లో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ పెద్దలపై ప్రేమాభిమానాలను చాటుకుంటూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. నృత్యాలు, పాటలు, ఆటపాటలతో అలరించారు. విద్యార్థులు, వారి తాతయ్యలు, అమ్మమ్మలు కలిసి నిర్వహించిన సరదా ఆటలు, వినోద కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

చిన్నారులు తమ పెద్దలతో కలిసి ఆనందంగా గడిపిన క్షణాలు వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. పెద్దల అనుభవాలు, ప్రేమ, ఆప్యాయతలు పిల్లల ఎదుగుదలకు ఎంతో విలువైనవని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. తరతరాల మధ్య ప్రేమానుబంధాలను పెంపొందించడం, కుటుంబ విలువలు, పెద్దల పట్ల గౌరవాన్ని విద్యార్థుల్లో పెంపొందించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ అనిల్ కాజా, అనురాధ, పాఠశాల ప్రిన్సిపల్ చిత్రా భట్, ఉపాధ్యాయులను తల్లిదండ్రులు, పెద్దలు అభినందించారు. విద్యార్థులు, వారి కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాల మధ్య వేడుకలు ఘనంగా ముగిశాయి.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bigg Boss | బిగ్‌బాస్ షో లైవ్‌లో లవ్ ప్రపోజల్ - స్టేజ్‌మీద కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్ తల్లిదండ్రులు
- ●TG Weather | బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం.. తెలంగాణకు రెడ్ అలెర్ట్..!
- ●Rahul Gandhi Ramlila Maidan Speech | జ్ఞానేశ్ కుమార్ జైలుకెళ్లడం ఖాయం.. తర్వాత మోదీ నీ వంతే!
- ●Rc 17 Movie | గ్రాండ్‌గా రామ్‌చరణ్, సుకుమార్ మూవీ లాంఛ్ - స్పెషల్ అట్రాక్షన్‌గా మెగాస్టార్
- ●November Weather | నవంబర్‌లో భానుడి భగభగలే
- ●Gajakesari Raja Yoga | నవంబర్ 3న గజకేసరి రాజయోగం.. ఈ 3 రాశులకు ఆర్థికంగా అన్నీ లాభాలే..!

Bigg Boss | బిగ్‌బాస్ షో లైవ్‌లో లవ్ ప్రపోజల్ - స్టేజ్‌మీద కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్ తల్లిదండ్రులు

TG Weather | బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం.. తెలంగాణకు రెడ్ అలెర్ట్..!

Rahul Gandhi Ramlila Maidan Speech | జ్ఞానేశ్ కుమార్ జైలుకెళ్లడం ఖాయం.. తర్వాత మోదీ నీ వంతే!

Rc 17 Movie | గ్రాండ్‌గా రామ్‌చరణ్, సుకుమార్ మూవీ లాంఛ్ - స్పెషల్ అట్రాక్షన్‌గా మెగాస్టార్




