HMWSSB | హైదరాబాదీలకు అలెర్ట్.. 36 గంటలు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు బ్రేక్
HMWSSB | నవంబర్ 3 నుంచి 36 గంటలపాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగనున్నది. గండిపేట కాండ్యూట్‌లో సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల వద్ద ఏర్పడిన భారీ లీకేజీలకు మరమ్మతులు చేపట్టనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) వెల్లడించింది. ఈ పనులు నవంబర్ 3న మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై నవంబర్ 4న బుధవారం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయి.
HMWSSB | నవంబర్ 3 నుంచి 36 గంటలపాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగనున్నది. గండిపేట కాండ్యూట్‌లో సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల వద్ద ఏర్పడిన భారీ లీకేజీలకు మరమ్మతులు చేపట్టనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) వెల్లడించింది. ఈ పనులు నవంబర్ 3న మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై నవంబర్ 4న బుధవారం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయి. మొత్తం 36 గంటలపాటు మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది.
గోషామహల్, కార్వాన్ సర్కిళ్ల పరిధిలోని రెడ్‌హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడేకీ ఖబర్, హిందీనగర్, అసెంబ్లీ, సెక్రటేరియట్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్‌నగర్, నాంపల్లి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాంతం, గన్‌ఫౌండ్రీ ప్రాంతాలపై ప్రభావం పడనుంది. అలాగే గోల్కొండ జోన్ పరిధిలోని చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ, ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, అహ్మద్‌నగర్ ప్రాంతాల్లోనూ సరఫరా నిలిచిపోనుంది. కవాడిగూడ సర్కిల్ పరిధిలోని కవాడిగూడ, గాంధీనగర్ వార్డులతో పాటు దోమలగూడ తదితర ప్రాంతాల్లోనూ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. జూబ్లీహిల్స్ సర్కిల్‌లోని బంజారాహిల్స్ వార్డు పరిధిలోనూ ఇదే పరిస్థితి ఉండనుంది. మరమ్మతు పనుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల వినియోగదారులు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి సూచించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●JP Nadda | ప్రజాస్వామ్యం ముసుగులో దేశంలో అరాచకం సృష్టించే కుట్ర
- ●Sobhita Dhulipala | సంక్రాంతి రేసులో అక్కినేని కోడలి తమిళ మూవీ - టాలీవుడ్ హీరోలతో పోటీ...
- ●INDIA bloc march | ఇండీ కూటమి మెగా మార్చ్.. ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణించిన నేతలు
- ●Uppal police | ఆన్లైన్లో తాళాలు పగలగొట్టేది నేర్చుకుని.. ఇళ్లలో చోరీలు.. మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
- ●CM Revanth Reddy Delhi Tour | రావణుడు లాంటి మోదీని గద్దె దించేందుకు ఢిల్లీకి వచ్చిన తెలంగాణ వానర సైన్యం
- ●Kavitha | ఓబీసీ, ఆదివాసీల జనగణనపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి

JP Nadda | ప్రజాస్వామ్యం ముసుగులో దేశంలో అరాచకం సృష్టించే కుట్ర

Sobhita Dhulipala | సంక్రాంతి రేసులో అక్కినేని కోడలి తమిళ మూవీ - టాలీవుడ్ హీరోలతో పోటీ...

INDIA bloc march | ఇండీ కూటమి మెగా మార్చ్.. ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణించిన నేతలు

Uppal police | ఆన్లైన్లో తాళాలు పగలగొట్టేది నేర్చుకుని.. ఇళ్లలో చోరీలు.. మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు




