త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemulawada | వ్య‌క్తికి గుండెపోటు.. ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్

Vemulawada | వేముల‌వాడ ప‌ట్ట‌ణంలో ఓ వ్య‌క్తి గుండెపోటుకు గుర‌య్యాడు. అక్క‌డే ఉన్న ఓ ఇద్ద‌రు ఏఆర్ కానిస్టేబుల్స్.. బాధితుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.

S

Telangana | Published On Dec 9, 2025, 4.01 pm IST

Vemulawada | వ్య‌క్తికి గుండెపోటు.. ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్
Advertisement

Vemulawada | రాజ‌న్న సిరిసిల్ల : వేముల‌వాడ ప‌ట్ట‌ణంలో ఓ వ్య‌క్తి గుండెపోటుకు గుర‌య్యాడు. అక్క‌డే ఉన్న ఓ ఇద్ద‌రు ఏఆర్ కానిస్టేబుల్స్.. బాధితుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. అనంత‌రం అత‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం బాధితుడి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

వేముల‌వాడ ప‌ట్ట‌ణంలోని తిప్పాపూర్ బ‌స్టాండ్ వ‌ద్ద అక‌స్మాత్తుగా ఓ వ్య‌క్తి కుప్ప‌కూలిపోయాడు. అక్క‌డే విధులో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్స్ గంగ‌రాజు, శ్రీనివాస్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. బాధిత వ్య‌క్తికి ఇద్ద‌రు కానిస్టేబుల్స్ క‌లిసి సీపీఆర్ చేశారు. అత‌ను స్పృహలోకి రావ‌డంతో.. చికిత్స నిమిత్తం వేముల‌వాడ ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది. బాధితుడిని వేముల‌వాడ మున్సిపాలిటీ ప‌రిధిలోని నాంప‌ల్లికి చెందిన ర‌మేశ్‌గా గుర్తించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement