త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan | జ‌న‌వ‌రి 3న కొండ‌గ‌ట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

Pawan Kalyan | ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌వ‌రి 3వ తేదీన జ‌గిత్యాల జిల్లాలోని కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించ‌నున్నారు.

S

Telangana | Published On Dec 21, 2025, 12.40 pm IST

Pawan Kalyan | జ‌న‌వ‌రి 3న కొండ‌గ‌ట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!
Advertisement

Pawan Kalyan | హైద‌రాబాద్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌వ‌రి 3వ తేదీన జ‌గిత్యాల జిల్లాలోని కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించ‌నున్నారు. ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం టీటీడీ అతిథి గృహంతో పాటు దీక్షా మండ‌పానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు కొండ‌గ‌ట్టును శ‌నివారం సంద‌ర్శించారు. గెస్ట్ హౌజ్‌తో పాటు దీక్షా మండ‌పానికి కావాల్సిన ప్ర‌తిపాదిత స్థ‌లాన్ని ప‌రిశీలించారు. అతిథి గృహాన్ని 100 గ‌దుల‌తో నిర్మించ‌నున్నారు. 2 వేల మంది కూర్చునేలా దీక్షా మండాపాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ రెండు ప్ర‌తిపాద‌న‌ల‌కు ఇటీవ‌ల టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది.

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ ఏడాది జూన్ 29న ప‌వ‌న్ క‌ల్యాణ్ కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. త‌గిన‌న్ని అతిథి గృహాలు లేవ‌ని ఆల‌య అధికారులు, అర్చ‌కులు ప‌వ‌న్ క‌ల్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కొండ‌గ‌ట్టులో 100 గ‌దుల‌తో గెస్ట్ హౌజ్, 2 వేల మంది కూర్చునేలా దీక్షా మండ‌పాన్ని నిర్మించాల‌ని కోరుతూ ప‌వ‌న్ క‌ల్యాణ్ టీటీడీ అధికారుల‌కు ఒక విన‌తి ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. డిప్యూటీ సీఎం విన‌తిని అధికారులు స్వీక‌రించి, గెస్ట్ హౌజ్, దీక్షా మండ‌పం నిర్మాణానికి చ‌ర్య‌లు ప్రారంభించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement