త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pavan Kalyan | కేటీఆర్ నాకు బ్ర‌ద‌రే.. ఆయ‌న త‌ప్పుగా మాట్లాడ‌రు : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Pavan Kalyan | నిన్న జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప్రాంతీయ వివాదంపై తెలంగాణ‌లో నిప్పు రాజుకున్న విష‌యం తెలిసిందే. పార్టీల‌క‌తీతంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు.

S

Telangana | Published On Jun 3, 2026, 7.19 pm IST

Pavan Kalyan | కేటీఆర్ నాకు బ్ర‌ద‌రే.. ఆయ‌న త‌ప్పుగా మాట్లాడ‌రు :  ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
Advertisement

Pavan Kalyan | త్రినేత్ర‌.న్యూస్ : నిన్న జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప్రాంతీయ వివాదంపై తెలంగాణ‌లో నిప్పు రాజుకున్న విష‌యం తెలిసిందే. పార్టీల‌క‌తీతంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌డుతూ.. తెలంగాణ క‌చ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల జాగీరే అని వ్యాఖ్యానించారు. అయితే అమ‌రావ‌తిలో పొట్టి శ్రీరాములు విగ్ర‌హావిష్క‌ర‌ణ అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా జ‌ర్న‌లిస్టులు కేటీఆర్ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించ‌గా, ఈ విధంగా స్పందించారు.

కేటీఆర్ నాకు బ్ర‌ద‌ర్.. ఆయ‌న‌తో మంచి రిలేష‌న్‌షిప్ ఉంది. అనేక సంద‌ర్భాల్లో క‌లిశాం. పాల‌సీల్లో ఒక మాట అటుంట‌ది.. ఇటుంట‌ది కానీ ఆయ‌న ఏమ‌న్నారో చూడ‌లేదు. నాకు తెలిసీ ఆయ‌న త‌ప్పుగా మాట్లాడ‌రు అని కేటీఆర్‌ను ఉద్దేశించి ప‌వ‌న్ పేర్కొన్నారు.

తెలంగాణలో ఇంకా తెలంగాణ భావోద్వేగం ఉంది. ఏపీలో అలాంటి భావోద్వేగం లేదు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన మహానుభావుడిని కులానికి పరిమితం చేశారు. తెలంగాణలో పార్టీ ఆఫీసు తీసేసినా నాయకులు, జనసైనికులు అలాగే ఉన్నారు. నిన్న జరిగిన పరిణామాలతోనే తెలంగాణలో పోటీపై ప్రకటన చేయాల్సి వచ్చింది. దేశ సమగ్రతకు భంగం కలిగించే దేన్నయినా గట్టిగా అడ్డుకుంటా. తెలంగాణ, గద్దర్‌ కుటుంబ సభ్యులపై నాకు గౌరవం ఉంది. తెలంగాణ కోసం పనిచేస్తాం. తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. దాన్ని ఎవరూ కాదనరు. కానీ, అందులోకి రానివ్వమని చెప్పడంపైనే అభ్యంతరం వ్యక్తం చేశా. గద్దర్ వంటి వారు ఎప్పుడూ ఇలా ఎవరినీ రావొద్దని మాట్లాడలేదు. ఆంధ్రా నాయకులు ఎవరూ వెళ్లి తెలంగాణలో పోటీ చేయట్లేదు. తెలంగాణ భూమి పుత్రులే పోటీ చేస్తామంటే అభ్యంతరమేంటి? విద్వేషాలకు ముగింపు పలకాలనేదే నా ఆలోచన అని పవన్ స్ప‌ష్టం చేశారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement