Allari Naresh | భక్తి కథతో అల్లరి నరేష్ మూవీ – హీరోయిన్‌గా కాజల్ – షూటింగ్ కంప్లీట్ కాకముందే ఓటీటీ డీల్ క్లోజ్
కెరీర్‌లో ఫస్ట్ టైమ్ భక్తి కథతో అల్లరి నరేష్ ఓ సినిమా చేస్తున్నాడు. కనకదుర్గ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ పూర్తికాకముందే ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజయ్యింది.
Allari Naresh | సినిమాల పరంగా రూటు మార్చాడు అల్లరి నరేష్. ఫస్ట్ టైమ్ భక్తి కథతో ఓ సినిమా చేస్తోన్నాడు. కనకదుర్గ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ చౌదరి హీరోయిన్ నటిస్తోంది. బీవీఎస్ రవి కథను అందిస్తున్నారు.
జీ5 ఓటీటీ
షూటింగ్ పూర్తికాకముందే కనకదుర్గ మూవీ ఓటీటీ డీల్ క్లోజయ్యింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేటుకు రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ మైథాలజీ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
అమ్మవారి మహిమలతో...
కనకదుర్గ అమ్మవారి మహిమలకు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడిస్తూ ఈ సినిమా తెరకెక్కుతోంది. భక్తి భావంతో పాటు నేటితరం ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే అంశాలన్నీ సినిమాలో ఉంటాయని మేకర్స్ చెబుతోన్నారు. అల్లరి నరేష్ కెరీర్‌లో ఓ డిఫరెంట్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు.
అనగనగా...
ప్రస్తుతం కనకదుర్గ షూటింగ్ సాగుతోంది. బిర్లా స్టూడియోస్ సమర్పణలో టెంపుల్ టౌన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. హీరోయిన్‌గా కాజల్ చౌదరికి ఇది సెకండ్ మూవీ. సుమంత్ అనగనగా మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కనకదుర్గతో పాటు కరాలి, అచ్చులు పేరుతో తెలుగులో మరో రెండు సినిమాలు చేస్తోంది.
రంభ ఊర్వశి మేనక...
మరోవైపు అల్లరి నరేష్ హీరోగా నటించిన రంభ ఊర్వశి మేనక మూవీ సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రాబోతుంది. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సురభి, రాశీసింగ్, విష్ణుప్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సార్ పరంగా ఈ సినిమాకు అడ్డంకులు ఎదురైనట్లు ప్రచారం జరుగుతోంది. విష్ణుప్రియ, రాశీసింగ్ పాత్రలను చూపించిన తీరుపై సెన్సార్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు – స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్
సెప్టెంబర్ 13, 2026

Irumudi OTT | అఫీషియల్ – థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి – నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్
సెప్టెంబర్ 13, 2026

Dhruv Vikram | టాలీవుడ్ డైరెక్టర్‌తో వివాదం – దిగొచ్చిన ధృవ్ విక్రమ్
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Surabhi Vanidevi | క్యూర్ బిల్లును మమ అనిపించారు
- ●Xi Jinping Skips Modi Dinner | మోదీ ఇచ్చిన డిన్నర్‌కు జిన్‌పింగ్ డుమ్మా: సదస్సుకు వచ్చి విందుకు ఎందుకు పోలేదు?
- ●Deshapathi Srinivas | రేవంత్‌ది విజన్ లేని పాలనే కాదు.. వజన్ లేని పాలన కూడా
- ●Daman Tourism | ఒకప్పుడు ‘మందు’ అడ్డా.. ఇప్పుడో అద్భుతం: ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!
- ●Nagarjuna | పర్యావరణ హితం కోసం సీడ్ గణేషుడినే పూజించండి - అక్కినేని నాగార్జున పిలుపు
- ●TRS | టీఆర్ఎస్లోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి.. అక్టోబర్‌లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ

Surabhi Vanidevi | క్యూర్ బిల్లును మమ అనిపించారు

Xi Jinping Skips Modi Dinner | మోదీ ఇచ్చిన డిన్నర్‌కు జిన్‌పింగ్ డుమ్మా: సదస్సుకు వచ్చి విందుకు ఎందుకు పోలేదు?

Deshapathi Srinivas | రేవంత్‌ది విజన్ లేని పాలనే కాదు.. వజన్ లేని పాలన కూడా

Daman Tourism | ఒకప్పుడు ‘మందు’ అడ్డా.. ఇప్పుడో అద్భుతం: ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్!



