Jagadeesh Reddy | నీళ్లన్నీ ఆంధ్రాకు దోచుకెళ్తున్నరు
Jagadeesh Reddy | పోతిరెడ్డిపాడు నుంచి వెలుగంగ ద్వారా నీళ్లను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ దోచుకొని పోతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. మహబూబ్‌నగర్ తప్పా ఉమ్మడి తొమ్మది జిల్లాలకు కాళేశ్వరం నీళ్లు పారుతున్నాయన్నారు.
- మహబూబ్‌నగర్ తప్పా ఉమ్మడి 9 జిల్లాలకు కాళేశ్వరం నీళ్లు పారుతాయి
- కన్నేపల్లి నుంచి 150 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనయ్
- కాంగ్రెస్ శాపంతోనే ఉమ్మడి నల్లగొండలో ఫ్లోరైడ్
- మాక్ అసెంబ్లీలో కాంగ్రెస్ తీరును ఎండగట్టిన ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
Jagadeesh Reddy | త్రినేత్ర.న్యూస్: పోతిరెడ్డిపాడు నుంచి వెలుగంగ ద్వారా నీళ్లను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ దోచుకొని పోతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. మహబూబ్‌నగర్ తప్పా ఉమ్మడి తొమ్మది జిల్లాలకు కాళేశ్వరం నీళ్లు పారుతున్నాయన్నారు. కన్నేపల్లి నుంచి 150 టీఎంసీల నీళ్లు ఇప్పటికే సముద్రం పాలయ్యాయని చెప్పారు. ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ఇరిగేషన్‌పై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ శాపంతోనే ఉమ్మడి నల్లగొండలో ఫ్లోరైడ్ మొదలైందని.. దాన్ని కేసీఆర్ వచ్చాక తన్ని తరిమారని గుర్తు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి నీళ్ల విషయంలో అన్యాయం జరిగింది. అక్రమంగా పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం నుంచి నీళ్లను తరలించారు. మహబూబ్ నగర్ తప్ప.. ఉమ్మడి తొమ్మిది జిల్లాలకు కాళేశ్వరం నీళ్లు పారుతాయి. తెలంగాణలో రెండు కోట్ల ఎకరాలను సాగులో తెచ్చిన ఘనత కేసీఆర్ ది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను నింపాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. కాళేశ్వరం నీళ్లు సూర్యాపేట జిల్లాల్లో పొంగిపొర్లాయి.
కాంగ్రెస్ శాపంతోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్. కేసీఆర్ వచ్చిన తర్వాత ఫ్లోరైడ్‌ను తన్ని తరిమారు. కేసీఆర్ హయాంలో ఎడమ కాల్వ గేట్లను ఓపెన్ చేసిన తరువాతనే కుడి కాలువ గేట్లు ఓపెన్ చేసేవారు. కాంగ్రెస్ హయాంలో కుడి కాలువ గేట్లు ఓపెన్ చేసిన తరువాతనే ఎడమ కాలువ గేట్లు ఓపెన్ చేస్తున్నారు.
పోతిరెడ్డిపాడు నుంచి వెలుగంగ ద్వారా అక్రమంగా నీళ్లను ఆంధ్ర ప్రదేశ్ దోచుకొనిపోతుంది. కన్నేపల్లి నుంచి వేల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలిశాయి. ఇప్పటికే 150 టీఎంసీల నీళ్ళు సముద్రంలో కలిశాయి. కాంగ్రెస్ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరువు వచ్చింది అని జగదీశ్ రెడ్డి విమర్శించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Talasani Srinivas Yadav | ఏ 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామో మేము చెప్పినమా?.. సీఎం తలసాని
సెప్టెంబర్ 12, 2026

Harish Rawat | ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాక్.. పదవుల నుంచి తప్పుకున్న మాజీ సీఎం
సెప్టెంబర్ 12, 2026

Rain Alert | రెండు రోజులు విస్తారంగా వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Smartwatch | స్మార్ట్ వాచ్ ధరిస్తే తలనొప్పి వస్తుందా..? వైద్యులు ఏం చెబుతున్నారు..?
- ●Talasani Srinivas Yadav | ఏ 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామో మేము చెప్పినమా?.. సీఎం తలసాని
- ●Delhi To Guangzhou direct flights | జిన్‌పింగ్ భారత పర్యటన వేళ కీలక పరిణామం.. ఆరేళ్ల తర్వాత ఢిల్లీకి చైనా విమాన సర్వీసులు
- ●Renu Desai | లవ్‌స్టోరీతో రేణుదేశాయ్ రీఎంట్రీ - డైరెక్ట్‌గా ఓటీటీలో మూవీ రిలీజ్
- ●Adi Srinivas | పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్నారు.. వీరప్పన్‌ను మించిన ఘనులు బీఆర్ఎస్ నేతలు: ఆది శ్రీనివాస్
- ●Vladimir Putin | వారి వల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతోంది : పుతిన్

Smartwatch | స్మార్ట్ వాచ్ ధరిస్తే తలనొప్పి వస్తుందా..? వైద్యులు ఏం చెబుతున్నారు..?

Talasani Srinivas Yadav | ఏ 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామో మేము చెప్పినమా?.. సీఎం తలసాని

Delhi To Guangzhou direct flights | జిన్‌పింగ్ భారత పర్యటన వేళ కీలక పరిణామం.. ఆరేళ్ల తర్వాత ఢిల్లీకి చైనా విమాన సర్వీసులు

Renu Desai | లవ్‌స్టోరీతో రేణుదేశాయ్ రీఎంట్రీ - డైరెక్ట్‌గా ఓటీటీలో మూవీ రిలీజ్



