త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cheruvugattu Jatara | నేటి నుంచి చెరువుగ‌ట్టు బ్ర‌హ్మోత్స‌వాలు..

Cheruvugattu Jatara | న‌ల్ల‌గొండ జిల్లా నార్క‌ట్‌ప‌ల్లి మండ‌లంలోని చెరువుగ‌ట్టులో శ్రీ పార్వ‌తీ జ‌డ‌ల రామ‌లింగేశ్వ‌ర స్వామి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలకు (Cheruvugattu Jatara) స‌ర్వం సిద్ధ‌మైంది. శుక్ర‌వారం నుంచి ఈ నెల 30 వ‌ర‌కు జాత‌ర కొన‌సాగ‌నుంది.

G

Telangana | Published On Jan 23, 2026, 1.13 pm IST

Cheruvugattu Jatara | నేటి నుంచి చెరువుగ‌ట్టు బ్ర‌హ్మోత్స‌వాలు..
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: న‌ల్ల‌గొండ జిల్లా నార్క‌ట్‌ప‌ల్లి మండ‌లంలోని చెరువుగ‌ట్టులో శ్రీ పార్వ‌తీ జ‌డ‌ల రామ‌లింగేశ్వ‌ర స్వామి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలకు (Cheruvugattu Jatara) స‌ర్వం సిద్ధ‌మైంది. శుక్ర‌వారం నుంచి ఈ నెల 30 వ‌ర‌కు జాత‌ర కొన‌సాగ‌నుంది. శుక్ర‌వారం సాయంత్రం నల్లగొండ పట్టణ పురవీధుల్లో స్వామివారి నగరోత్సవంతో ఉత్సవాలు మొదలుకానున్నాయి.

సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారి కల్యాణం నిర్వ‌హించ‌నున్నారు. బుధవారం తెల్లవారుజామున అగ్ని గుండాలతో జాత‌ర ముగియ‌నుంది. జాత‌ర‌కు ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాతోపాటు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లిరానున్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా ఆల‌య అధికారులు, ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement