త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sampath Kumar | మల్లమ్మకుంట రైతులకు శుభవార్త : మాజీ ఎమ్మెల్యే సంప‌త్ కుమార్

Sampath Kumar | అలంపూర్ నియోజకవర్గంలోని తుమ్మిళ్ళ లిఫ్ట్ కింద నిర్మించబోయే మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా భూ సేకరణ పూర్త‌యి భూ నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సుదీర్ఘంగా చ‌ర్చించారు.

S

Telangana | Published On Oct 4, 2026, 4.01 pm IST

Sampath Kumar | మల్లమ్మకుంట రైతులకు శుభవార్త : మాజీ ఎమ్మెల్యే సంప‌త్ కుమార్
Advertisement

Sampath Kumar | త్రినేత్ర న్యూస్ : అలంపూర్ నియోజకవర్గంలోని తుమ్మిళ్ళ లిఫ్ట్ కింద నిర్మించబోయే మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా భూ సేకరణ పూర్త‌యి భూ నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఇంతకు ముందే ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎకరాకు రూ. 16,50,000 కాకుండా ఆ నష్ట పరిహారాన్ని మరింత పెంచడానికి ముఖ్యమంత్రిని సంపత్ కుమార్ కోరారు.

సంపత్ కుమార్ విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిని కోల్పోయే రైతులకు ఇబ్బంది లేకుండా తగిన నష్టపరిహారం అందేలా చూస్తామని అన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంలో సంపత్ కుమార్ కీలకంగా వ్యవహరించి అలంపూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడం కొరకు చూపుతున్న శ్రద్ధను సీఎం ప్రశంసించారు. ఈ సమావేశంలో నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీ మల్లు రవి, నాగార్జున సాగ‌ర్ ఎమ్మెల్యే కుందూరు జ‌య‌వీర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement