Sanjay Jaju | కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు.. సచివాలయంలో బాధ్యతల స్వీకరణ
Sanjay Jaju | రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సీఎస్‌గా కొనసాగిన రామకృష్ణారావు ఇవాళ పదవీ విరమణ పొందారు.
Sanjay Jaju | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సీఎస్‌గా కొనసాగిన రామకృష్ణారావు ఇవాళ పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26న ఉత్తర్వలు జారీ చేసిన విషయం విదితమే. ఈమేరకు రాష్ట్ర సచివాలయంలో సంజయ్ జాజు కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ శాఖల విభాగాధిపతులు, సచివాలయ అధికారులు, సిబ్బంది సంజయ్ జాజుకు అభినందనలు తెలిపారు. కే.రామకృష్ణారావుకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపినట్లు పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ పేర్కొన్నారు.

కాగా 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ సబ్‌కలెక్టర్‌గా, పశ్చిమగోదావరి కలెక్టర్‌గా, హైదరాబాద్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా పని చేశారు. 2014 నుంచి కేంద్ర సర్వీసులో ఉన్నారు. 2029, ఫిబ్రవరి వరకు సర్వీసులో ఉండనున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | ఒట్టు అనేదానికి పాణముంటే నీ అబద్దాలు వినలేక చచ్చేది
- ●Minister Vivek | రూ. కోటి పరిహారం అందే వరకు సిగాచీ కంపెనీని వదిలిపెట్టం : మంత్రి వివేక్
- ●Siya Goyal - Ketan Agarwal Case | సియా పెళ్లికి ఎందుకు 'నో' చెప్పలేకపోయింది? పుణె మర్డర్ కేసుపై చేతన్ భగత్ సంచలన విశ్లేషణ
- ●Tree Falls On School Bus | స్కూల్ బస్సుపై కూలిన చెట్టు.. 10 ఏళ్ల చిన్నారి మృతి.. పలువురికి గాయాలు
- ●Sai Pallavi | సాయిపల్లవినా .. మజాకా - షూటింగ్ మొదలుకాకముందే మణిరత్నం మూవీ బిజినెస్ క్లోజ్
- ●Delhi EV Policy | ఢిల్లీ ఈవీ పాలసీ ఎఫెక్ట్.. ఓలా, ఏథర్ షేర్లలో భారీగా కొనుగోళ్లు..

Harish Rao | ఒట్టు అనేదానికి పాణముంటే నీ అబద్దాలు వినలేక చచ్చేది

Minister Vivek | రూ. కోటి పరిహారం అందే వరకు సిగాచీ కంపెనీని వదిలిపెట్టం : మంత్రి వివేక్

Siya Goyal - Ketan Agarwal Case | సియా పెళ్లికి ఎందుకు 'నో' చెప్పలేకపోయింది? పుణె మర్డర్ కేసుపై చేతన్ భగత్ సంచలన విశ్లేషణ

Tree Falls On School Bus | స్కూల్ బస్సుపై కూలిన చెట్టు.. 10 ఏళ్ల చిన్నారి మృతి.. పలువురికి గాయాలు




