త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sunil Mittal, Revanth Reddy | ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్ క్వార్ట‌ర్‌గా హైద‌రాబాద్

Sunil Mittal, Revanth Reddy | హైద‌రాబాద్‌ను ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్ క్వార్ట‌ర్‌లా చూస్తున్నామ‌ని ప్రముఖ పారిశ్రామిక వేత్త , భారతీ ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ పేర్కొన్నారు. డేటా సెంట‌ర్ల కెపాసిటీని మ‌రింత పెంచ‌డానికి ముందుకు వ‌స్తామ‌ని సీఎం రేవంత్ సూచ‌న మేర‌కు ఆయ‌న‌ హామీ ఇచ్చారు.

S

Telangana | Published On Jun 30, 2026, 3.34 pm IST

Sunil Mittal, Revanth Reddy | ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్ క్వార్ట‌ర్‌గా హైద‌రాబాద్
Advertisement
  • డేటా సెంట‌ర్ల కెపాసిటీ పెంపున‌కూ సునీల్ మిట్ట‌ల్‌ హామీ
  • చందన్‌వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించాల‌న్న సీఎం
  • ప్ర‌భుత్వ సంస్క‌ర‌ణ‌ల‌ను సునీల్ మిట్ట‌ల్‌కు వివ‌రించిన రేవంత్

Sunil Mittal, Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్: హైద‌రాబాద్‌ను ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్ క్వార్ట‌ర్‌లా చూస్తున్నామ‌ని ప్రముఖ పారిశ్రామిక వేత్త , భారతీ ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ పేర్కొన్నారు. డేటా సెంట‌ర్ల కెపాసిటీని మ‌రింత పెంచ‌డానికి ముందుకు వ‌స్తామ‌ని సీఎం రేవంత్ సూచ‌న మేర‌కు ఆయ‌న‌ హామీ ఇచ్చారు. ఫైబ‌ర్ క‌నెక్టివిటీ మ‌రింత పెంచ‌డంపైన ఆస‌క్తి ఉంద‌ని పేర్కొన్నారు. ఎంసీఆర్‌హెచ్‌ ఆర్డీ బోధీ పెవిలియ‌న్‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిను మంగ‌ళ‌వారం ఆయ‌న మర్యాద పూర్వకంగా కలిశారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌క్రిష్ణారావు కూడా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాల‌పై సీఎం రేవంత్‌తో క‌లిసి సునీల్ మిట్ట‌ల్ చ‌ర్చించారు.

తెలంగాణ ప్ర‌భుత్వ విద్య‌లో తీసుకువ‌స్తున్న సంస్క‌ర‌ణ‌ల‌ను సీఎం రేవంత్ మిట్ట‌ల్‌కు వివ‌రించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేస్తున్నాం. నిరుద్యోగుల్లో నైపుణ్యాల‌ను పెంపోందించ‌డానికి స్కిల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఐటీఐల‌ను ఏటీసీ (అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ సెంట‌ర్స్‌) లుగా మారుస్తున్నాం. పాలిటెక్నిక్ క‌ళాశాల‌ను అభివృద్ధి చేస్తున్నాం. చందన్‌వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలి అని సీఎం రేవంత్ సూచించారు.

డేటా సెంట‌ర్‌, ఏఐ స‌దుపాయాల క్యాంప‌న్‌ను ఏర్పాటు చేయండి..

తెలంగాణలో మరింత పెద్ద సమగ్ర డేటా సెంటర్, AI మౌలిక సదుపాయాల క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలి. హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ , AI కార్యకలాపాలపైన దృష్టి పెట్టాలి. భవిష్యత్ పెట్టుబడి అవకాశాలు, సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేసేలా ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నామినేట్ చేసి స‌మ‌న్వ‌యం చేసుకోవాలి అని సీఎం పేర్కొన్నారు.

న‌వీన్ మిట్ట‌ల్ స్పందిస్తూ భార‌తీ పౌండేష‌న్ ద్వారా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, ఏటీసీల్లో చ‌దువుకునే విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్‌లు అంద‌జేస్తామ‌న్నారు. ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్ క్వార్ట‌ర్‌లా హైద‌రాబాద్‌ను చూస్తున్నామ‌న్నామ‌ని సునీల్ మిట్ట‌ల్ వెల్ల‌డించారు.

Advertisement
Advertisement