త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Acer TravelLite TL24-54M | ఏసర్ ట్రావెల్‌లైట్ బిజినెస్ ల్యాప్‌టాప్.. చాలా తేలిక‌, శ‌క్తివంతంగా ప‌నిచేస్తుంది..

Acer TravelLite TL24-54M | ఏసర్ భారత మార్కెట్‌లో కొత్త ట్రావెల్‌లైట్ బిజినెస్ ల్యాప్‌టాప్ టీఎల్24-54ఎంను విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ 18ఏ ప్రాసెస్ నోడ్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఇంటెల్ కోర్ సిరీస్ 3 ప్రాసెసర్లు ఉన్నాయి.

S

Technology | Published On Jun 30, 2026, 4.14 pm IST

Acer TravelLite TL24-54M | ఏసర్ ట్రావెల్‌లైట్ బిజినెస్ ల్యాప్‌టాప్.. చాలా తేలిక‌, శ‌క్తివంతంగా ప‌నిచేస్తుంది..
Advertisement

Acer TravelLite TL24-54M | ఏసర్ భారత మార్కెట్‌లో కొత్త ట్రావెల్‌లైట్ బిజినెస్ ల్యాప్‌టాప్ టీఎల్24-54ఎంను విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ 18ఏ ప్రాసెస్ నోడ్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఇంటెల్ కోర్ సిరీస్ 3 ప్రాసెసర్లు ఉన్నాయి. ప్రధానంగా ఎంటర్‌ప్రైజ్‌లు, ఎస్‌ఎమ్‌బీలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల వాణిజ్య వినియోగం, టెక్నాలజీ అప్‌గ్రేడ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు. ట్రావెల్‌లైట్ టీఎల్24-54ఎంలో 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లేను అందించారు. ఇది 89 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో, అల్ట్రా-న్యారో బెజెల్స్‌తో వస్తుంది. అలాగే 180 డిగ్రీల హింజ్‌తో స్క్రీన్‌ను పూర్తిగా తిప్పుకునే సౌకర్యం కూడా ఉంది. ప్రీమియం అల్యూమినియం ఛాసిస్‌తో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్ బరువు కేవలం 1.22 కిలోలు మాత్రమే. దీని వ‌ల్ల ప్రయాణాల్లోనూ ఈ ల్యాప్‌టాప్‌ను చాలా సుల‌భంగా ఉప‌యోగించ‌వ‌చ్చు. చాలా తేలిగ్గా ఉంటుంది.

64జీబీ వ‌ర‌కు ర్యామ్‌కు స‌పోర్ట్‌..

ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ కోర్ సిరీస్ 3 ప్రాసెసర్ వేరియెంట్ల‌ను ఇచ్చారు. గరిష్టంగా 64జీబీ డీడీఆర్5 ర్యామ్, పీసీఐఈ జెన్4 ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌కు మద్దతు లభిస్తుంది. భద్రత కోసం టీపీఎమ్ 2.0, బయోఎస్ స్థాయి సెక్యూరిటీ, ఐచ్ఛిక ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్, ప్రైవసీ కెమెరా షట‌ర్, కెన్సింగ్టన్ లాక్ వంటి ఫీచర్లను అందించారు. ఈ ల్యాప్‌టాప్ మిలిట‌రీ గ్రేడ్ స‌ర్టిఫికేష‌న్‌ను క‌లిగి ఉన్నందున బిల్డ్ క్వాలిటీ చాలా దృఢంగా ఉంటుంది. ఎక్కువ కాలం పాటు మ‌న్నిక‌గా ప‌నిచేస్తుంది. అలాగే కనెక్టివిటీ కోసం వై-ఫై 7, డిస్‌ప్లే, పవర్ డెలివరీ సపోర్ట్‌తో యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, హెచ్‌డీఎంఐ 2.1, గిగాబిట్ లాన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే బ్యాటరీ హెల్త్‌, దీర్ఘకాల వినియోగాన్ని మెరుగుపరిచేందుకు ఏసర్ ఫ్లెక్సీచార్జర్ టెక్నాలజీని కూడా ఇందులో అందించారు.

ఏసర్ ట్రావెల్‌లైట్ టీఎల్24-54ఎం ల్యాప్‌టాప్‌ను ఏసర్ కమర్షియల్ భాగస్వాముల ద్వారా విక్రయిస్తున్నారు. ఆసక్తి ఉన్న వినియోగదారులు ఏసర్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఉచిత డెమోను కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ల్యాప్ టాప్ ధ‌ర వివ‌రాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. స్టోర్‌లో అందుబాటులోకి రాగానే ధ‌రను ప్ర‌క‌టించ‌నుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement