Kothagudem | చెరో రెండున్నరేండ్లు.. కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య కుదిరిన ఒప్పందం
Kothagudem | కొత్తగూడెం (Kothagudem) కార్పొరేషన్ మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మేయర్ పీఠాన్ని పంచుకునేందుకు కాంగ్రెస్, సీపీఐ ఒక ఒప్పందానికి వచ్చాయి.
Kothagudem | త్రినేత్ర.న్యూస్: కొత్తగూడెం (Kothagudem) కార్పొరేషన్ మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మేయర్ పీఠాన్ని పంచుకునేందుకు కాంగ్రెస్, సీపీఐ ఒక ఒప్పందానికి వచ్చాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్‌లోని (Kothagudem Corporation) మొత్తం 60 డివిజన్లకుగాను కాంగ్రెస్‌కు 22, సీపీఐకి 22 సీట్లు వచ్చాయి. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన 31 సీట్లు ఏ ఒక్క పార్టీకీ రాలేదు.
దీంతో 8 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ సీపీఐకి బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ ముందుకొచ్చింది. ఫలితంగా బీఆర్‌ఎస్ 8 కార్పొరేటర్ల బలం కలుపుకుంటే సీపీఐకి మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం ఏర్పడింది. మరోవైపు స్వతంత్రులతో పాటు కొందరు తిరుగుబాటు కార్పొరేటర్లతో కాంగ్రెస్ పార్టీ కూడా మేయర్ పదవి కోసం ప్రయత్నాలు చేసినా, ఆ తర్వాత నిలిపివేసింది. ఇరుపార్టీల అగ్ర నాయకత్వం జోక్యం చేసుకోవడంతో మేయర్ పదవిపై ఒక స్పష్టత వచ్చింది.
మొదటి రెండున్నరేండ్లు మేయర్ పదవి సీపీఐకి, డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ తీసుకోవాలని, ఆ తర్వాత రెండున్నరేండ్లు కాంగ్రెస్ మేయర్ పదవి, సీపీఐ డిప్యూటీ మేయర్ పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కాగా, పవర్ షేరింగ్‌పై రెండు పార్టీల స్థానిక నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది.
సంబంధిత వార్తలు

Chamala Kiran Kumar Reddy | బండి సంజయ్.. గత ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నదెవరు?: ఎంపీ చామల
ఆగస్టు 19, 2026

Harish Rao | బీఆర్ఎస్ నేతల సనత్‌నగర్ టిమ్స్ సందర్శన.. హరీశ్ రావు, తలసాని హౌస్ అరెస్ట్..
ఆగస్టు 19, 2026

Danam Nagender | బీఆర్ఎస్కి రాజీనామా చేయలే.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలే: దానం నాగేందర్
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు



