Harish Rao | త్వరలోనే సిద్దిపేటకు యూనివర్సిటీ తీసుకువస్తా
Harish Rao | ఒకప్పుడు ఎన్నికల నినాదాలుగా.. గోడలపై రాతలుగా మిగిలిన రైలు, గోదావరి జలాలు, ప్రత్యేక జిల్లా కలలను సిద్దిపేట ప్రజల ఆశీస్సులతో సాకారం చేసుకున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.
సిద్దిపేటకు గోదావరి జలాలు, రైలు తీసుకొచ్చాం
ప్రత్యేక జిల్లా కలను సాకారం చేసుకున్నాం
ఉన్నత విద్యాలయాల కేంద్రంగా సిద్దిపేటను తీర్చిదిద్దాం
ఇక సాధించాల్సింది యూనివర్సిటీనే
దసరా వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు
Harish Rao | త్రినేత్ర న్యూస్ : ఒకప్పుడు ఎన్నికల నినాదాలుగా.. గోడలపై రాతలుగా మిగిలిన రైలు, గోదావరి జలాలు, ప్రత్యేక జిల్లా కలలను సిద్దిపేట ప్రజల ఆశీస్సులతో సాకారం చేసుకున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటను ఉన్నత విద్యాలయాల కేంద్రంగా తీర్చిదిద్దామని, ఇక సాధించాల్సింది యూనివర్సిటీ మాత్రమేనని, త్వరలోనే దానిని కూడా సాధించి తీరుతామని ప్రకటించారు.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్, రంగదాంపల్లి, ఎన్సాన్‌పల్లి, సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన దసరా ఉత్సవాలు, రావణ దహన కార్యక్రమాల్లో హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దుర్గామాత, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, జమ్మి పూజ అనంతరం రావణ దహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, యువత, మహిళలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నుంచి అభివృద్ధి ప్రస్థానం వరకు సిద్దిపేటకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ నాయకత్వంలోని మలిదశ ఉద్యమం వరకు సిద్దిపేట ముందుండి పోరాడిందని గుర్తుచేశారు.
ఒకప్పుడు సిద్దిపేటకు రైలు రావాలని, గోదావరి జలాలు పారాలని, ప్రత్యేక జిల్లా కావాలని ప్రజలు ఆకాంక్షించేవారని పేర్కొన్నారు. నేడు ఆ మూడు కలలు సాకారమయ్యాయని అన్నారు. సిద్దిపేట సమీపంలో రైలు పరుగులు తీస్తుండటం అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. సుమారు రూ.400 కోట్లతో రైల్వే విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నాయని, మరో ఏడాది లేదా రెండేళ్లలో విద్యుత్ రైళ్ల ద్వారా సిద్దిపేట నుంచి ఢిల్లీ, తిరుపతికి నేరుగా ప్రయాణించే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గతంలో చిన్నచిన్న పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, నేడు సిద్దిపేటలో సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుతో పరిపాలనా సౌకర్యాలు మెరుగుపడ్డాయని హరీశ్ రావు అన్నారు.
సిద్దిపేటను ఉన్నత విద్యకు కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటీఐ, పీజీ, మహిళా డిగ్రీ, వ్యవసాయ, వెటర్నరీ విద్యాసంస్థలను అందుబాటులోకి తీసుకొచ్చామని హరీశ్ రావు వివరించారు.

త్వరలోనే సిద్దిపేటకు యూనివర్సిటీ
రైలు వచ్చింది, గోదావరి జలాలు అందుబాటులోకి వచ్చాయి, ప్రత్యేక జిల్లా ఏర్పాటైంది, విద్యాసంస్థల కేంద్రంగా సిద్దిపేట ఎదిగిందని హరీశ్ రావు అన్నారు. ఇక సిద్దిపేటకు యూనివర్సిటీ తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతో త్వరలోనే యూనివర్సిటీని సాధించి తీరుతామని హామీ ఇచ్చారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Tirumala | తిరుమలలో సిఫారసు లేఖలు తాత్కాలికంగా రద్దు
- ●Lawyer Suicide | ఖమ్మం జిల్లాలో విషాదం.. యువ న్యాయవాది ఆత్మహత్య
- ●Hyderabad Zoo | దసరా రోజు హైదరాబాద్ జూపార్కుకు పోటెత్తిన సందర్శకులు..
- ●అక్టోబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని లాభాలు..!
- ●Palitana Temples Gujarat | ఆ కొండపై 900 పాలరాతి ఆలయాలు.. కానీ సూర్యాస్తమయం తర్వాత ఒక్క మనిషి కూడా ఉండకూడదు!
- ●Teja Sajja | ఇంటివాడు కాబోతున్న హనుమాన్ హీరో - కాబోయే భార్య ఎవరంటే?

Tirumala | తిరుమలలో సిఫారసు లేఖలు తాత్కాలికంగా రద్దు

Lawyer Suicide | ఖమ్మం జిల్లాలో విషాదం.. యువ న్యాయవాది ఆత్మహత్య

Hyderabad Zoo | దసరా రోజు హైదరాబాద్ జూపార్కుకు పోటెత్తిన సందర్శకులు..

అక్టోబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని లాభాలు..!




