త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Umar Khalid | ఉమ‌ర్ ఖ‌లీద్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊర‌ట‌.. మ‌ధ్యంత‌ర బెయిల్‌పై జైలు నుంచి మూడురోజులు విడుద‌ల‌..!

Umar Khalid | ఢిల్లీ అల్ల‌ర్ల కుట్ర కేసులో నిందితుడైన మాజీ జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమ‌ర్ ఖ‌లీద్‌కు ఢిల్లీ హైకోర్టు ఊర‌ట‌నిచ్చింది. అత‌నికి మూడురోజుల మ‌ధ్యంత‌ర బెయిల్‌ను మంజూరు చేసింది. తన తల్లి శస్త్రచికిత్స నేపథ్యంలో ఊర‌ట కోర‌గా కోర్టు ఈ వెసులుబాటు ఇచ్చింది.

P

National | Published On May 22, 2026, 1.43 pm IST

Umar Khalid | ఉమ‌ర్ ఖ‌లీద్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊర‌ట‌.. మ‌ధ్యంత‌ర బెయిల్‌పై జైలు నుంచి మూడురోజులు విడుద‌ల‌..!
Advertisement

Umar Khalid | ఢిల్లీ అల్ల‌ర్ల కుట్ర కేసులో నిందితుడైన మాజీ జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమ‌ర్ ఖ‌లీద్‌కు ఢిల్లీ హైకోర్టు ఊర‌ట‌నిచ్చింది. అత‌నికి మూడురోజుల మ‌ధ్యంత‌ర బెయిల్‌ను మంజూరు చేసింది. తన తల్లి శస్త్రచికిత్స నేపథ్యంలో ఊర‌ట కోర‌గా కోర్టు ఈ వెసులుబాటు ఇచ్చింది. సుమారు ఆరు సంవత్సరాలుగా జైల్లో ఉన్న ఖాలిద్ జూన్ 1 నుంచి 3 వరకు విడుద‌ల‌కానున్నాడు. అయితే, రిలీజ్ కోసం రూ.ల‌క్ష వ్య‌క్తిగ‌త బాండ్‌తో పాటు ష్యూరిటీని స‌మ‌ర్పించాల‌ని హైకోర్టు ఆదేశించింది. అలాగే, క‌ద‌లిక‌ల‌పై జ‌స్టిస్ ప్ర‌తిభా సింగ్‌, జ‌స్టిస్ మ‌ధు జైన్‌ల‌తో కూడిన డివిజ‌న్ బెంచ్ ప‌రిమితులు విధించింది. ఖాలిద్ జాతీయ రాజ‌ధాని ప‌రిధిలోని త‌న అడ్ర‌స్‌లోనే ఉండాల‌ని, తల్లి ఆసుపత్రి చికిత్స కోసం మాత్ర‌మే వెళ్లాల‌ని.. ఇత‌ర ప్ర‌దేశాల‌కు వెళ్ల‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఒకే మొబైల్ నంబ‌ర్‌ను మాత్ర‌మే వాడాల‌ని కోర్టు తేల్చి చెప్పింది.

ఉమ‌ర్ ఖ‌లీద్‌ను ఢిల్లీ పోలీసులు 2020 నార్త్ ఈస్ట్ ఢిల్లీ అల్ల‌ర్ల కేసులో ప్ర‌ధాన కుట్ర‌దారుడిగా పోలీసులు అభియోగాలు మోపారు. ఈ అల్ల‌ర్ల‌లో 53 మంది ప్రాణాలు కోల్పోగా.. వంద‌లాది మంది గాయ‌ప‌డ్డారు. ఈ కేసులో ఉపా చ‌ట్టం కింద ఉమ‌ర్ ఖ‌లీద్ అభియోగాలు న‌మోద‌య్యాయి. అయితే, తన తల్లి శస్త్రచికిత్సను దృష్టిలో ఉంచుకుని, అలాగే మరణించిన మామయ్య “చెహ్లుమ్” కార్యక్రమానికి హాజరయ్యేందుకు 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఖాలిద్ కోర్టును కోరాడు. అయితే, ట్రయల్ కోర్టు ఉమ‌ర్ ఖ‌లీద్ రిక్వెస్ట్‌ను తిర‌స్క‌రించింది. దాంతో హైకోర్టును ఆశ్ర‌యించాడు. విచార‌ణ సంద‌ర్భంగా అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్‌వీ రాజు ఢిల్లీ పోలీసుల త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించారు. త‌ల్లి శ‌స్త్ర చికిత్స విష‌యం చిన్న‌దేన‌ని, అత‌ని కుటుంబంలో ఐదుగురు అక్కాచెల్లెల్లు ఉన్నార‌ని కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు. పోలీస్ ఎస్కార్ట్‌తో ఒక్కరోజు అనుమతిస్తే సరిపోతుందని తెలిపారు. ఇరువ‌ర్గాల వాద‌న‌లు వినిపించిన హైకోర్టు చివ‌రికి మూడురోజుల మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది. క‌ఠిన ష‌ర‌తులు విధిస్తూ తాత్కాలికంగా విడుద‌ల చేయాల‌ని ఆదేశించింది.

Advertisement
Advertisement