త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | రేపు వ‌ద్దు.. మ‌రో తేదీన విచారించండి.. సిట్‌కు బ‌దులిచ్చిన కేసీఆర్

KCR | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నోటీసుల‌పై కేసీఆర్ స్పందించారు. జ‌న‌వ‌రి 30న విచార‌ణ వ‌ద్దు.. మ‌రో తేదీన విచారించండి అని జూబ్లీహిల్స్ డివిజ‌న్ ఏసీపీ పీ వెంక‌ట‌గిరికి కేసీఆర్ లేఖ రాశారు.

S

Telangana | Published On Jan 29, 2026, 8.17 pm IST

KCR | రేపు వ‌ద్దు.. మ‌రో తేదీన విచారించండి.. సిట్‌కు బ‌దులిచ్చిన కేసీఆర్
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నోటీసుల‌పై కేసీఆర్ స్పందించారు. జ‌న‌వ‌రి 30న విచార‌ణ వ‌ద్దు.. మ‌రో తేదీన విచారించండి అని జూబ్లీహిల్స్ డివిజ‌న్ ఏసీపీ పీ వెంక‌ట‌గిరికి కేసీఆర్ లేఖ రాశారు.

అయితే ఈనెల 30వ తేదీన మున్సిప‌ల్ ఎన్నిక‌ల నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు ముగియ‌నుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థులంద‌రికీ బీ ఫామ్‌లు ఇవ్వాల్సిన నేప‌థ్యంలో మ‌రో తేదీన విచారించాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల త‌ర్వాత విచార‌ణ జ‌ర‌పాల‌న్నారు. ప‌లానా చోట విచారించాల‌ని సీఆర్పీసీలో ఎక్క‌డా లేదు. 65 ఏళ్లు పైబ‌డిన వాళ్లు ఎక్క‌డ ఉంటే అక్క‌డే విచార‌ణ చేయాలి. ఇక‌పై నోటీసులు ఇవ్వాలంటే నా వ్య‌వ‌సాయ క్షేత్రానికే పంపాలి. బాధ్య‌త గ‌ల పౌరుడిగా విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తాను అని కేసీఆర్ తెలిపారు. సీఆర్పీసీ ప్రోసిజ‌ర్‌ను సిట్‌కు కేసీఆర్ తెలియ‌జేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement