Director | దర్శకుడిగా కల నెరవేరిన మరుసటిరోజే విషాదం – మలయాళ యంగ్ డైరెక్టర్ హఠాన్మరణం
దర్శకుడు కావాలనే తన కల నెరవేరి ఒక్క రోజు కూడా కాకముందే మలయాళ యంగ్ డైరెక్టర్ కన్నుమూశాడు. మలయాళ వెబ్‌సిరీస్ కప్పి స్క్వాడ్ శుక్రవారం జియో హాట్‌స్టార్‌లో రిలీజైంది. ఈ సిరీస్‌తో బేల్‌రాజ్ కలరిక్కల్ దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ సిరీస్ రిలీజైన తర్వాత రోజే బేల్‌రాజ్ గుండెపోటుతో కన్నుమూశారు.
Entertainment | Published On Oct 17, 2026, 4.42 pm IST
Director | మలయాళ వెబ్‌సిరీస్ కప్పిస్క్వాడ్ శుక్రవారం జియో హాట్‌స్టార్‌లో రిలీజైంది. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌తోనే దర్శకుడిగా బేల్‌రాజ్ కలరిక్కల్ మలయాళ సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. దర్శకుడిగా తన పేరు స్క్రీన్‌పై చూసుకోవాలనే ఎన్నో ఏళ్ల బేల్‌రాజ్ కల నెరవేరింది. కానీ అంతలోనే విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ఈ దర్శకుడు హఠాన్మరణం చెందారు. కొచ్చిలోని ఓ హోటల్ రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ని సిబ్బంది హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే గుండెపోటుతో దర్శకుడు కన్నుమూసినట్లు డాక్టర్లు ప్రకటించారు. 27 ఏళ్ల చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడంతో మలయాళ సినీ వర్గాలు దిగ్భాంతికి లోనవుతున్నాయి.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా...
మలయాళంలో నిజాల్, మధురం, డాకినితో పాటు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు బేల్‌రాజ్. కప్పిస్క్వాడ్తో దర్శకుడిగా మారాడు. ఈ వెబ్‌సిరీస్‌లో రినోష్ జార్జ్, అనఘా అజిత్, దివ్య దీపన్, జోయల్ జోసెఫ్ కీలక పాత్రల్లో కనిపించారు. తమ కలలను నెరవేర్చుకునే క్రమంలో నలుగురు యువతీయువకులకు ఎదురైన అడ్డంకులతో ఈ వెబ్‌సిరీస్ రూపొందింది. బేల్‌రాజ్ టేకింగ్‌కు ప్రశంసలు వచ్చాయి. విజయం తాలూకు అనందాన్ని చూడకుండానే బేల్‌రాజ్ కన్నుమూయడం విషాదాన్ని మిగిల్చింది.
నెల రోజుల క్రితమే పెళ్లి...
బేల్రాజ్కు నెల రోజుల క్రితమే వివాహమైనట్లు తెలిసింది. గత ఆరేళ్లుగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్న బేల్‌రాజ్ పెద్దలను ఒప్పించి సెప్టెంబర్‌లో ప్రియురాలితో ఏడడుగులు వేసినట్లు సన్నిహితులు తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OTT | డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన మౌనీరాయ్ బాలీవుడ్ బోల్డ్ మూవీ – రెడ్‌లైట్ ఏరియా కథలతో…
సెప్టెంబర్ 28, 2026

OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు ఇవే – రవితేజ బ్లాక్‌బస్టర్‌తో పాటు ఈ మలయాళం థ్రిల్లర్‌ను మిస్సవ్వొద్దు
సెప్టెంబర్ 18, 2026

Jio Hotstar | జియోహాట్‌స్టార్ గ్లోబల్ ఎంట్రీ.. 3 దేశాల్లో సేవలు ప్రారంభం
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●SIP | ఉద్యోగం కోల్పోతే ఎస్ఐపీకి దెబ్బ.. గ్యాప్ తరువాత ఎంత పెంచాలి..?
- ●West Bengal Voter List Deletion ECI | బెంగాల్లో 5.38 లక్షల ఓట్లు గల్లంతు.. అసలు రహస్యం బయటపడింది!
- ●Dhruv Rathee | యూట్యూబర్ ధృవ్ రాఠేపై బెయిలబుల్ వారెంట్
- ●Noodles | రాత్రి నూడుల్స్ తిన్నారు.. పొద్దున ప్రాణాలు విడిచారు
- ●Sridhar Babu | సీఎం చేతుల మీదుగా త్వరలో కేయూ హబ్: మంత్రి శ్రీధర్‌బాబు
- ●IPL 2027 | ముంబయి ఇండియన్స్ కోచ్ పదవికి జయవర్ధనే గుడ్‌బై

SIP | ఉద్యోగం కోల్పోతే ఎస్ఐపీకి దెబ్బ.. గ్యాప్ తరువాత ఎంత పెంచాలి..?

West Bengal Voter List Deletion ECI | బెంగాల్లో 5.38 లక్షల ఓట్లు గల్లంతు.. అసలు రహస్యం బయటపడింది!

Dhruv Rathee | యూట్యూబర్ ధృవ్ రాఠేపై బెయిలబుల్ వారెంట్

Noodles | రాత్రి నూడుల్స్ తిన్నారు.. పొద్దున ప్రాణాలు విడిచారు



