Accident | నడుచుకుంటూ వెళ్తుండగా ఢీకొట్టిన కారు.. అమాంతం గాల్లో ఎగిరిపడ్డ వ్యక్తి.. వీడియో
Accident | ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. అతి వేగంగా దూసుకువచ్చిన ఓ కారు అతన్ని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అమాంతం గాల్లో ఎగిరిపడ్డాడు. ఈ ఘోర ప్రమాదం మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలో చోటు చేసుకుంది.
Accident | ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. అతి వేగంగా దూసుకువచ్చిన ఓ కారు అతన్ని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అమాంతం గాల్లో ఎగిరిపడ్డాడు. ఈ ఘోర ప్రమాదం మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామ పరిధిలో ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఓ కారు అతి వేగంగా దూసుకువచ్చింది. అదుపుతప్పి ఆ వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో బాధిత వ్యక్తి గాల్లో ఎగిరిపడ్డాడు. కారు రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. బాధితుడు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని హైదరాబాద్ గండి మైసమ్మ ప్రాంతానికి చెందిన శ్రీధర్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాద ఘటన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సీసీటీవీ ఫుటేజ్
కారు ఢీకొట్టడంతో గాల్లో ఎగిరి పల్టీలు కొట్టిపడి వ్యక్తి మృతి
మెదక్ జిల్లా కుల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న శ్రీధర్ అనే వ్యక్తిని అతి వేగంగా ఢీకొట్టిన కారు
దీంతో గాల్లో ఎగిరి పల్టీలు కొట్టిపడి అక్కడికక్కడే మృతి pic.twitter.com/G9HTjNuJ6F
— Telugu Scribe (@TeluguScribe) December 15, 2025
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






