Shani Vakri 2026 | త్వరలో తిరోగమించనున్న శనిదేవుడు.. ఈ మూడురాశుల వారికి అన్నీ శుభవార్తలే..!
వచ్చే నెలలో శనైశ్చరుడు (Saturn) మీన రాశిలో (Pisces Zodiac) తిరోగమించనున్నాడు. వృశ్చిక (Scorpio), మకర (Capricorn), మీన (Pisces) రాశుల వారికి ఇది అనుకూలంగా ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. ఉద్యోగం (Job Opportunities), వ్యాపారం (Business Growth), ఆర్థిక లాభాలు (Financial Gains), విద్యారంగం (Education Success)లో పురోగతి కనిపించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
Shani Vakri 2026 | జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని కర్మఫలదాతగా పరిగణిస్తారు. అన్ని గ్రహాల్లో అత్యంత నెమ్మదిగా సంచరించే గ్రహంగా శనికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే శని ప్రత్యక్ష గమనం, వక్రగమనం, రాశి మార్పులకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. వాటి ప్రభావం దీర్ఘకాలం పాటు కొనసాగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శని దేవుడు త్వరలో మీన రాశిలో తిరోగమించనున్నాడు. జూలై 27న శని మీన రాశిలో తిరోగమనం చెందనున్నాడు. మళ్లీ డిసెంబర్ 11న తిరిగి ఉదయించనున్నాడు. ఈ తిరోగమనం కాలంలో కొన్ని రాశుల వారికి అత్యంత శుభప్రదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, విద్యారంగంలో సానుకూల మార్పులు చోటుచేసుకోవచ్చని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. మరి శని వక్రగతి వల్ల ఎక్కువ ప్రయోజనం పొందే రాశులు ఏవో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వృశ్చిక రాశి వారికి శని దేవుడు జాతకంలోని మూడో, నాలుగో స్థానాలకు అధిపతి. ప్రస్తుతం శని ఐదో స్థానంలో తిరోగమనం చెందనున్నాడు. ఈ పరిణామం వృశ్చిక రాశి వారికి అనేక విధాలుగా అనుకూల ఫలితాలుంటాయి. ఈ కాలంలో సంతాన యోగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ సంబంధాల్లో చాలా కాలంగా కొనసాగుతున్న అపోహలు, విభేదాలు తొలగిపోయే అవకాశముంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరిగి, అనుబంధం మరింత బలపడుతుంది. విద్యారంగంలో ఉన్న విద్యార్థులు, సృజనాత్మక రంగాల్లో పనిచేసే వారికి మంచి అవకాశాలు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మరింత బలపడుతుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పురోగతి సాధించే ఛాన్స్ ఉంది.
మకర రాశి
మకర రాశికి అధిపతి స్వయంగా శని దేవుడే. అలాగే, జాతకంలోని రెండో స్థానానికి శనినే అధిపతిగా పరిగణిస్తారు. ప్రస్తుతం శని ఈ రాశివారికి మూడో స్థానంలో వక్రగతిలో సంచరించనున్నాడు. దీంతో కెరీర్ పరంగా కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్తలు అందే అవకాశం ఉందని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో చేసిన కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు కూడా ఈ కాలం ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు, వ్యాపార భాగస్వామ్యాలు, కొత్త ప్రణాళికలు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చేసిన కష్టానికి తగిన ఫలితాలు అందడం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల్లో క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది.
మీన రాశి
మీన రాశి వారికి శని దేవుడు లాభ స్థానం అయిన పదకొండో ఇంటికి, వ్యయ స్థానం అయిన పన్నెండో ఇంటికి అధిపతి. ప్రస్తుతం శని ఈ రాశి లగ్న స్థానంలోనే తిరోగమించనున్నాడు. దాంతో చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశముంది. ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు తగ్గి ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో స్థిరత్వం ఏర్పడవచ్చు. సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో చేసిన పెట్టుబడుల ద్వారా లాభాలు అందే సూచనలు కూడా ఉన్నాయి. మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో స్పష్టత పెరిగే అవకాశం ఉంది. శని దేవుని అనుగ్రహంతో వ్యాపార రంగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుని, అభివృద్ధి దిశగా అడుగులు పడవచ్చని పండితులు పేర్కొంటున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..






