Mallareddy Engineering College | ఓ విద్యార్థి చేసిన పనికి.. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి భారీ జరిమానా..?
Mallareddy Engineering College | తన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరగా.. ఫీజు చెల్లించిన తర్వాతే ఇస్తామని వాదించిన మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి వినియోగదారుల కమిషన్-1 భారీ జరిమానా విధించింది. బాధిత విద్యార్థికి రూ. లక్ష పరిహారంతో పాటు రూ. 10 వేలు కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది.
Mallareddy Engineering College | త్రినేత్ర.న్యూస్ : ఇంజినీరింగ్ చదవాలనే కోరికతో.. ఓ విద్యార్థి మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో చేరాడు. కానీ ఆర్థిక పరిస్థితులు తీవ్రమవడంతో.. మధ్యలోనే చదువు ఆపేశాడు. తిరిగి తన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరగా.. ఫీజు చెల్లించిన తర్వాతే ఇస్తామని వాదించిన మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి వినియోగదారుల కమిషన్-1 భారీ జరిమానా విధించింది. బాధిత విద్యార్థికి రూ. లక్ష పరిహారంతో పాటు రూ. 10 వేలు కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది.
నాంపల్లికి చెందిన రాకేష్‌వర్మ కుమారుడు 2021 అక్టోబరులో మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ (ఏఐ, మెషిన్ లెర్నింగ్) కోర్సులో చేరాడు. ఇంజినీరింగ్ ఫస్టియర్ ట్యూషన్ ఫీజు కింద రూ. 80 వేలు చెల్లించాడు. ఆ సమయంలో విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యం తీసుకున్నారు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో ఫీజులు చెల్లించలేక చదువును కొనసాగించలేకపోయాడు.
దీంతో కాలేజీకి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇవ్వాలని యాజమాన్యాన్ని ప్రాధేయపడ్డాడు. కానీ వారు కనికరించలేదు. రూ. 80 వేలు చెల్లిస్తేనే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇస్తామని సిబ్బంది తేల్చిచెప్పారు. ఇలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి.
తన భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని చివరకు గతేడాది సెప్టెంబర్ నెలలో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. అయితే కమిషన్ నుంచి నోటీసులు అందిన వెంటనే.. కాలేజీ యాజమాన్యం విద్యార్థి సర్టిఫికెట్లను తిరిగిచ్చేసి, కేసును కొట్టేయాలని కోరింది. యాజమాన్యం వైఖరి వల్ల విద్యార్థి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడని పేర్కొన్న కమిషన్, 45 రోజుల్లో రూ.1.10 లక్షలను చెల్లించాలని.. లేనిపక్షంలో 9% వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
తాజావార్తలు
- ●TG TET | ఇంకా 7 వేల మంది టీచర్లు 'టెట్' ఫెయిల్
- ●ATM Charges | 3 రోజులు బ్యాంకుల సమ్మె.. ఏటీఎం చార్జీలపై ఖాతాదారులకు ఊరట..
- ●CJI Surya Kant | ప్రతి ఐదుగురు టీనేజర్లలో ఒకరికి డ్రగ్స్ ముప్పు: సీజేఐ
- ●N Ramachander Rao | కుటుంబవాదం భారత ప్రజాస్వామ్యానికే ముప్పు : ఎన్ రామచందర్ రావు
- ●Satyam Srirangam | జ్ఞానేశ్ కుమార్ అక్రమాలపై రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
- ●Ram Charan | దసరాకు రామ్‌చరణ్, సుకుమార్ మూవీ లాంఛ్ - గెస్ట్‌గా పవన్ కళ్యాణ్

TG TET | ఇంకా 7 వేల మంది టీచర్లు 'టెట్' ఫెయిల్

ATM Charges | 3 రోజులు బ్యాంకుల సమ్మె.. ఏటీఎం చార్జీలపై ఖాతాదారులకు ఊరట..

CJI Surya Kant | ప్రతి ఐదుగురు టీనేజర్లలో ఒకరికి డ్రగ్స్ ముప్పు: సీజేఐ

N Ramachander Rao | కుటుంబవాదం భారత ప్రజాస్వామ్యానికే ముప్పు : ఎన్ రామచందర్ రావు




