త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IAS Officers’ Association | ఎన్టీవీ, టీన్యూస్‌ల‌పై కేసు న‌మోదు

IAS Officers' Association | ఇటీవ‌ల ఒక మ‌హిళా ఐఏఎస్ అధికారిణి (Woman IAS Officer) పై మంత్రి (Minister) వేధింపుల వ్య‌వ‌హారంలో ఎన్టీవీ (NTV), టీన్యూస్‌ (T News), తెలుగు స్కైబ్ (Telugu Scribe) స‌హా ఇత‌ర డిజిట‌ల్ మీడియా చాన‌ల్స్‌పై సీసీఎస్ (CCS) పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆయా చాన‌ళ్లలో ప్ర‌సార‌మైన వార్త‌ల‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని ఐఏఎస్ అధికారుల సంఘం (IAS Officers' Association) కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్ (Jayesh Ranjan) సీసీఎస్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

A

Telangana | Published On Jan 12, 2026, 3.41 pm IST

IAS Officers’ Association | ఎన్టీవీ, టీన్యూస్‌ల‌పై కేసు న‌మోదు
Advertisement

IAS Officers' Association | త్రినేత్ర‌.న్యూస్ : ఇటీవ‌ల ఒక మ‌హిళా ఐఏఎస్ అధికారిణి (Woman IAS Officer) పై మంత్రి (Minister) వేధింపుల వ్య‌వ‌హారంలో ఎన్టీవీ (NTV), టీన్యూస్‌ (T News), తెలుగు స్కైబ్ (Telugu Scribe) స‌హా ఇత‌ర డిజిట‌ల్ మీడియా చాన‌ల్స్‌పై సీసీఎస్ (CCS) పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆయా చాన‌ళ్లలో ప్ర‌సార‌మైన వార్త‌ల‌పై విచార‌ణ జ‌రిపి మ‌హిళా ఐఏఎస్ అధికారిణిని మాన‌సికంగా వేధించినందుకు ఆయా చాన‌ళ్ల‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, యూట్యూబ్ (You Tube) తో పాటు సోష‌ల్ మీడియాల‌లో ఉన్న ఆ వార్త‌ల‌కు సంబంధించిన వీడియోల‌ను త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని ఐఏఎస్ అధికారుల సంఘం కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్ (Jayesh Ranjan) సీసీఎస్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీక‌రించిన పోలీసులు కేసు న‌మోదు చేసి, కేసును సీసీఎస్ ఏసీపీ గురు రాఘ‌వేంద్ర‌కు అప్ప‌గించారు.

ఒక మ‌హిళా ఐఏఎస్ అధికారిణిపై దిగజారి, ఆమె గోప్య‌త‌ను ఉల్లంఘిస్తూ తీవ్ర ఆరోప‌ణ‌ల‌ను చేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెపై అస‌భ్య ఆరోప‌ణ‌లు చేయ‌డంతో పాటు రాజ‌కీయ నాయ‌కుడితో సంబంధాలు అంట‌గ‌డుతూ, కుటుంబ ఇబ్బందులు అని ప్ర‌చారం చేశార‌ని చెప్పారు. వార్త పూర్తిగా త‌ప్ప‌ని, కుట్ర‌పూరితంగా ఆధార ర‌హితంగా వార్త ప్ర‌సారం చేశార‌ని ఆరోపించారు. ఈ వార్త‌ల‌తో రాష్ట్రంలో ప‌నిచేస్తున్న ఐఏఎస్ అధికారుల‌కు కూడా మాన‌సిక ఆందోళ‌న క‌లిగింద‌ని పేర్కొన్నారు. సౌక‌ర్య‌వంత‌మైన పోస్టింగ్‌ను త‌క్కువ కాలంలోనే ఇచ్చార‌ని చెప్ప‌డం సివిల్ స‌ర్వీసెస్ విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ‌తీస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వార్త‌ను ప్ర‌సారం చేయ‌డంతో పాటు దానిని యూట్యూబ్‌, ట్విట్ట‌ర్‌ల‌లో వైర‌ల్ చేశార‌ని చెప్పారు.

ఎన్‌టీవీ, తెలుగు స్క్రైబ్‌, ఎంఆర్ మీడియా, ప్రైమ్‌9, పీవీ న్యూస్‌, సిగ్న‌ల్ టీవీ, వోల్గా టైమ్స్‌, మిర్ర‌ర్ టీవీ, టీ న్యూస్ త‌దిత‌ర చాన‌ళ్ల‌పై వివిధ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేయాల‌ని ఫిర్యాదులో కోరారు. ఎన్‌టీవీ మేనేజ్‌మెంట్‌, ఎడిట‌ర్‌, రిపోర్ట‌ర్‌, యాంక‌ర్‌ల‌తో పాటు సోష‌ల్ మీడియా హ్యాండ్ల‌ర్ల‌పై కేసు న‌మోదు చేయ‌డంతో కంటెంట్ తొల‌గించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. మొత్తం ఉదంతంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని అన్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement