Jagadish Reddy | గోదావరిని ఏపీకి కట్టబెడుతున్నరు.. కాంగ్రెస్ సర్కారుపై జగదీశ్‌రెడ్డి మండిపాటు
Jagadish Reddy | సంక్రాంతి కానుకగా గోదావరిని చంద్రబాబు నాయుడికి అప్పగించారని, ముందు నుంచి అనుకున్నట్టే ఏపీకి కట్టబెడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్‌తో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.
Jagadish Reddy | సంక్రాంతి కానుకగా గోదావరిని చంద్రబాబు నాయుడికి అప్పగించారని, ముందు నుంచి అనుకున్నట్టే ఏపీకి కట్టబెడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్‌తో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాయర్లు కోర్టులకు వెళ్తారని, మంత్రులు వెళ్లడం ఏంటని ఆయన ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో మంత్రులకు తెలియదని, శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వరాని వారు కోర్టుకు వెళ్తున్నారని సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు అపర మేధావులని, చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని ఆరోపించారు. బలహీనమైన పిటిషన్ చెల్లదని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే గోదావరి, కృష్ణా జలాలను తాకట్టు పెడుతున్నారని, చంద్ర బాబు నాయుడు కనుసన్నల్లో దుర్మార్గం జరుగుతోందని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడుకు సమయం ఇచ్చేందుకు తప్పుడు పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారని, అంగు ఆర్భాటంగా సుప్రీం కోర్టుకు వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, బయటకు వచ్చే ముందు మొహం చూయించకుండా వెళ్లిపోయాడని విమర్శలు గుప్పించారు. అపెక్స్ కౌన్సిల్ చర్చ చెయ్యకుండా కోర్టుకు ఎలా వెళ్తారన్న ఆయన.. చంద్ర బాబు నాయుడు డైరెక్షన్‌లో పిటిషన్, డ్రాఫ్ట్ తయారైందని విమర్శించారు. చంద్రబాబు నాయుడి చెవిలో చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాడని రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు.. బనకచర్ల ప్రాజెక్ట్ ఆపమని ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉత్తర కుమార్ రెడ్డి చేసేందుకే సుప్రీంకోర్టుకు రేవంత్‌రెడ్డి పంపారని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనుమతిపై ఢిల్లీకి ఎందుకు పోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అనవసరంగా ఢిల్లీతో పంచాయతీ పెట్టుకున్నాడని రేవంత్ రెడ్డి కోతలు కోశాడని, ఇప్పుడు చంద్రబాబు నాయుడి అక్రమ ప్రాజెక్టులను ఎందుకు ఆపడం లేదని ధ్వజమెత్తారు. బీజేపీ నుంచి రక్షణ పొందడానికే ఈ చీకటి ఒప్పందమని, కేసులను కాపాడుకుందుకు కృష్ణ, గోదావరి జలాలను అప్పజెప్పుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు దయ దక్షణాల మీదనే ఈ ప్రభుత్వం బతికి ఉందని, సోయిలేని ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని నిద్ర లేపామని, నిద్ర మత్తులో ఏదో ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడని ఆరోపించారు. లక్ష మందితో కేసీఆర్ గర్జన పెడితే సాగర్ మన ఆధీనంలో ఉంది అని ప్రకటన చేశారని, మోదీని చూస్తే ఈ ప్రభుత్వానికి లాగు తడుస్తుందని ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు ఎలా వచ్చాయో ప్రజలకు తెలుసునని, రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం ఏందో ప్రజలు చూస్తున్నారన్నారు. సీఎం, మంత్రుల వాటాల పంచాయతీ, ఢిల్లీకి మూటలు పంపించడం సరిపోతుందని, పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం నడిపిస్తున్నారన్నారు. దొంగల చేతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, తెలంగాణ ప్రజల్ని కాపాడుకునేందుకు కేసీఆర్ ఉన్నారన్నారు. తెలంగాణ హక్కులను కాపాడుతామని, రేవంత్ రెడ్డికి ప్లాట్ల దందా తప్ప మరోకటి తేలదని, ఏ శాఖలో ఏం జరుగుతుందో మంత్రులకు తెలియడం లేదని విమర్శించారు. సమావేశంలో పల్లె రవికుమార్ గౌడ్, కిశోర్ గౌడ్ పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



