KTR | మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్
KTR | తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి (Minister) కొండా సురేఖ (Konda Surekha)కు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది.
KTR | తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి (Minister) కొండా సురేఖ (Konda Surekha)కు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆమెకు ఈ వారెంట్ జారీ చేసి, తదుపరి ట్రయల్ కోసం ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. కేటీఆర్ దాఖలు చేసిన సీసీ నెంబర్.307 ఆఫ్ 2025 కేసు నాంపల్లి కోర్టులో పెండింగ్‌లో ఉండగా, ట్రయల్ ప్రారంభం కోసం గురువారానికి (11.12.2025)కు కేసును పోస్ట్ చేశారు. కాగా, నిందితురాలు కొండా సురేఖ ఎలాంటి కారణం లేకుండా, మినహాయింపు కోసం అభ్యర్థన కూడా చేయకుండా హాజరు కాలేదు.
ఆమె తరచుగా కోర్టుకు హాజరు కాకపోవడం, విచారణలో సహకరించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన నాంపల్లి కోర్టు ఆమె హాజరు కోసం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది కోర్టు జారీ చేసే అరెస్ట్ ఆర్డర్. దీని ద్వారా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచేందుకు అధికారాన్ని పొందుతారు. ఇలాంటి వారెంటులో పేరు ఉన్న వ్యక్తి తన హక్కుగా బెయిల్‌ను డిమాండ్ చేసే అవకాశం ఉండదు.
కొన్ని పత్రికలు, ఛానళ్లు, వెబ్ సైట్లలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గారికి న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినట్టు వార్తలు వస్తున్నాయని, అది పూర్తిగా అవాస్తమని ఆమె కార్యాలయ సిబ్బంది స్పష్టతనిచ్చారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 5వ తేదీన కోర్టుకి హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించిందని చెప్పారు. ఈ మేరకు మీడియా మిత్రులు అందరూ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



