త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gachibowli | గ‌చ్చిబౌలి అంజ‌య్యన‌గ‌ర్‌లో వ్య‌క్తి దారుణ హ‌త్య‌..

Gachibowli | హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలిలో (Gachibowli) ఓ వ్యక్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. గురువారం అర్ధ‌రాత్రి గ‌చ్చిబౌలిలోని అంజ‌య్య న‌గ‌ర్‌లో (Anjaiah Nagar) త‌న‌తోపాటు ప‌నిచేస్తున్న వ్య‌క్తిని క‌త్తితో పొడిచి హ‌త్య‌చేశాడు.

G

Hyderabad | Published On Sep 11, 2026, 9.50 am IST

Gachibowli | గ‌చ్చిబౌలి అంజ‌య్యన‌గ‌ర్‌లో వ్య‌క్తి దారుణ హ‌త్య‌..
Advertisement

Gachibowli | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలిలో (Gachibowli) ఓ వ్యక్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. గురువారం అర్ధ‌రాత్రి గ‌చ్చిబౌలిలోని అంజ‌య్య న‌గ‌ర్‌లో (Anjaiah Nagar) త‌న‌తోపాటు ప‌నిచేస్తున్న వ్య‌క్తిని క‌త్తితో పొడిచి హ‌త్య‌చేశాడు. శ‌శిధ‌ర్ అనే వ్య‌క్తి అంజ‌య్య‌న‌గ‌ర్‌లోని హ‌రిహ‌ర మెన్స్ హాస్ట‌ల్‌లో వంట మాస్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. అదే హాస్ట‌ల్‌లో ప్ర‌మోద్ అనే వ్య‌క్తి కూడా ప‌నిచేస్తున్నారు. గురువారం రాత్రి హాస్ట‌ల్ స‌మీపంలో శ‌శిధ‌ర్‌పై దాడిచేసిన‌ ప్రమోద్.. అత‌డిని క‌త్తితో విచ‌క్ష‌ణా ర‌హితంగా పొడిచాడు.

స్థానికులు స‌మాచారం మేర‌కు రాయదుర్గం పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ద‌వాఖాన‌కు తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. హ‌త్య‌కుగ‌ల కార‌ణాలపై ఆరాతీస్తున్నారు. ప‌రారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement