Travels Bus | డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన ట్రావెల్స్.. బస్సులో 36 మంది ప్రయాణికులు
Travels Bus | ఖమ్మం జిల్లా (Khammam) పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అర్ధరాత్రి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) బోల్తా పడింది.
Travels Bus | త్రినేత్ర.న్యూస్: ఖమ్మం జిల్లా (Khammam) పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అర్ధరాత్రి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) బోల్తా పడింది. అయితే ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కేవీఆర్ ట్రావెల్సుకు (KVR Travels) చెందిన బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెనుబల్లి మండలంలోని కొత్తలంకపల్లి రైల్వే వంతెనపై అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా (Overturn) పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన వారిని సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వ దవాఖానలకు తరలించారు.
గాయపడిన వారిలో సత్తుపల్లికి చెందిన ఎం. శిరీష, ఎం. శివగణేశ్, పి.మల్లిక, చక్కపల్లికి చెందిన శ్రీనివాసరావు, పావని, రాఘవాపురానికి చెందిన సుస్మిత, యువన్, విజయరాయికి చెందిన ప్రణీత్, స్వప్న, బి. నరసింహ, లింగపాలెంకు చెందిన తాతిన బాలాజీ, కుంచపర్తికి చెందిన ఆర్. రామకృష్ణ ఉన్నారు. బస్సులో ధర్మాజిగూడెం, అక్కిరెడ్డిగూడెం, లింగపాలెం, రాఘవాపురం, సత్తుపల్లి తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తున్నది.
తాజావార్తలు
- ●WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..
- ●Supreme Court | విద్యార్థులపై చర్యలు వద్దు.. వారిని వెంటనే వదిలిపెట్టండి.. పోలీసుల లాఠీఛార్జ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు
- ●Jurala Project | జూరాలకు పోటెత్తిన వరద.. దిగువకు 30 వేల క్యూసెక్కులు విడుదల
- ●CP Sumathi | దివ్యాంగుడి కలను నిజం చేసిన సీపీ సుమతి
- ●Attack with Knife | జనగామలో కత్తిపోట్ల కలకలం.. నలుగురు యువకులపై దాడి
- ●Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..

WhatsApp | ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ చాట్లను ఇలా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేయండి..

Supreme Court | విద్యార్థులపై చర్యలు వద్దు.. వారిని వెంటనే వదిలిపెట్టండి.. పోలీసుల లాఠీఛార్జ్‌పై సుప్రీం కీలక ఆదేశాలు

Jurala Project | జూరాలకు పోటెత్తిన వరద.. దిగువకు 30 వేల క్యూసెక్కులు విడుదల

CP Sumathi | దివ్యాంగుడి కలను నిజం చేసిన సీపీ సుమతి






