Himachal Accident | హిమాచల్‌లో ఘోర ప్రమాదం.. వాహనంపై విరిగొపడ్డ కొండచరియలు.. 13 మంది దుర్మరణం..!
Himachal Accident | హిమాచల్ ప్రదేశ్ లాహౌల్-స్పితిలో శుక్రవారం ఒక ఘోర ప్రమాదం జరిగింది. కుల్లు నుంచి పాంగికి వెళ్తున్న టాటా సుమో టాక్సీపై కాదు నాలా వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటను ఎస్పీ శివానీ మెహ్లా ధ్రువీకరించారు.
Himachal Accident | హిమాచల్ ప్రదేశ్ లాహౌల్-స్పితిలో శుక్రవారం ఒక ఘోర ప్రమాదం జరిగింది. కుల్లు నుంచి పాంగికి వెళ్తున్న టాటా సుమో టాక్సీపై కాదు నాలా వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటను ఎస్పీ శివానీ మెహ్లా ధ్రువీకరించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే టిండి పోలీసులు, స్థానిక అధికార యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆ తర్వాత యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం మేరకు.. కొండచరియలు విరిగిపడడంతో ఉదయ్‌పూర్-కిలాడ్ రోడ్డును అంతకు ముందే మూసివేశారు. దాంతో టాక్సీలోని ప్రయాణికులందరూ టిండి వద్ద చిక్కుకుపోయారు. శుక్రవారం రోడ్డుపై వాహనాల రాకపోకలకు అనుమతించారు. దాంతో సుమో పాంగికి బయలుదేరింది. కాదు నాలా వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో బండరాళ్లలోనే వాహనం చిక్కుకుపోయింది.
ఈ ప్రమాదం నుంచి ఒకరు బయటపడ్డారు. మిగతా వారికి గాలింపు చర్యలు చేపట్టారు. రెస్క్యూ బృందాలు ఓ వ్యక్తిని ప్రాణాలతో బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇతర ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు పూర్తయిన తర్వాతే ప్రయాణికుల సంఖ్య, మృతుల వివరాలపై స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఘటనపై భార్మూర్ ఎమ్మెల్యే జనక్‌రాజ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 13 మంది మరణించారని, ఇందులో ఆరునెలల పసిబిడ్డ సైతం ఉన్నారని తెలిపారు. ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన నివాళులర్పించారు. ఘటనపై హిమాచల్‌ప్రదేశ్ సీఎం ఠాకూర్ సుఖ్విందర్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి వెంటనే చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని లాహౌల్-స్పితి డిప్యూటీ కమిషనర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సాధ్యమైనంత సహాయం అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజావార్తలు
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!






