Nirmal Student | పుట్టినరోజు నాడే.. అమెరికాలో నిర్మల్ యువకుడి దుర్మరణం
Nirmal Student | అమెరికాలో (US) ఉన్నత చదువుల కోసం వెళ్లిన మరో నిర్మల్ యువకుడు (Nirmal Student) మృతిచెందారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి గన్ను (Nithyanand Reddy Gannu) ఎమ్మెస్ చేసేందుకు మూడేండ్ల క్రితం యూఎస్ వెళ్లారు.
Nirmal Student | త్రినేత్ర.న్యూస్: అమెరికాలో (US) ఉన్నత చదువుల కోసం వెళ్లిన మరో నిర్మల్ యువకుడు (Nirmal Student) మృతిచెందారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి గన్ను (Nithyanand Reddy Gannu) ఎమ్మెస్ చేసేందుకు మూడేండ్ల క్రితం యూఎస్ వెళ్లారు. ఇండియానా టెక్‌లో 2023 జనవరి-2024 డిసెంబర్ మధ్య ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. ఇటీవలే ఉద్యోగం చేరారు.
మిషిగన్ స్టేట్‌లోని (Michigan) డెట్రాయిట్‌లో ఉంటున్న నిత్యానంద రెడ్డి ఈ నెల 18న బైక్‌పై వెళ్తున్నారు. ఈక్రమంలో అకస్మాత్తుగా వచ్చిన ఓ కారు ఆయనను బలంగా ఢీకొట్టింది (Road Accident). దీంతో తీవ్ర గాయపడిన అతడిని స్నేహితులు దవాఖానలో చేర్చారు. ఈ నెల 23న అతని పుట్టినరోజు కావడంతో అతని స్నేహితులు హాస్పిటల్ బెడ్‌పైనే వేడుకలు నిర్వహించారు. ఇంతలో పరిస్థితి విషమించడంతో నిత్యానంద మృతిచెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. దీంతో పుట్టినరోజు నాడే కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు దుఃఖంలో మునిగిపోయారు. మృతదేహం త్వరగా స్వగ్రామానికి వచ్చేలా చూడాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కాగా, మెదలు రక్తం గడ్డకట్టడంతో ఆయన బ్రెయిన్ డెడ్ (Brain Dead) అయినట్లు ఈ నెల 22నే వైద్యులు నిర్ధారించారు. తాజాగా మృతిచెందినట్లు ప్రకటించారు.
తాజావార్తలు
- ●ప్రజలారా..పెద్ద మనసు చేసుకోండి.. సీఎం రేవంత్ రెడ్డి
- ●Jailer 2 OTT | రజనీకాంత్ జైలర్ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - నెల రోజుల్లోనే స్ట్రీమింగ్
- ●Poonam Bajwa | స్విమ్మింగ్‌పూల్‌లో టాలీవుడ్ హీరోయిన్ - బికినీ అందాలతో రచ్చ
- ●Rashmika Mandanna | రణబాలి కోసం రష్మిక మందన్న తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే?
- ●Theenmar Mallanna | రూ.5,500 కోట్లు ఖర్చు చేసినా వట్టెం ప్రాజెక్టు పూర్తికాలే
- ●Jailer 2 Review | జైలర్ 2 రివ్యూ - రజనీకాంత్ హీరోయిజం, ఎలివేషన్లు ఓకే కానీ ... కానీ కథ ఏది?

ప్రజలారా..పెద్ద మనసు చేసుకోండి.. సీఎం రేవంత్ రెడ్డి

Jailer 2 OTT | రజనీకాంత్ జైలర్ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - నెల రోజుల్లోనే స్ట్రీమింగ్

Poonam Bajwa | స్విమ్మింగ్‌పూల్‌లో టాలీవుడ్ హీరోయిన్ - బికినీ అందాలతో రచ్చ

Rashmika Mandanna | రణబాలి కోసం రష్మిక మందన్న తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే?






