త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Trains | సికింద్రాబాద్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-హైద‌రాబాద్‌ మార్గంలో 34 ప్రత్యేకరైళ్లు

Special Trains | రాష్ట్రంలో పెద్ద పండుగ‌లు బ‌తుక‌మ్మ‌, ద‌స‌ర‌. ప‌ట్ట‌ణాలు, న‌గరాల్లో ఉన్న‌వారు పండుగ‌ల‌కు స్వ‌స్థ‌లాల‌కు వెళ్తారు. ఈ నేప‌థ్యంలో ద‌క్షిణ మధ్య రైల్వే (SCR) ప్ర‌యాణికుల ర‌ద్దీని పుర‌స్క‌రించుకుని సికింద్రాబాద్‌-సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్-హైద‌రాబాద్‌ మార్గంలో ప్ర‌త్యేక రైళ్ల‌ను (Special Trains) న‌డుపుతున్న‌ది.

G

Telangana | Published On Oct 10, 2026, 9.19 am IST

Special Trains | సికింద్రాబాద్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-హైద‌రాబాద్‌ మార్గంలో 34 ప్రత్యేకరైళ్లు
Advertisement

Special Trains | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్రంలో పెద్ద పండుగ‌లు బ‌తుక‌మ్మ‌, ద‌స‌ర‌. ప‌ట్ట‌ణాలు, న‌గరాల్లో ఉన్న‌వారు పండుగ‌ల‌కు స్వ‌స్థ‌లాల‌కు వెళ్తారు. ఈ నేప‌థ్యంలో ద‌క్షిణ మధ్య రైల్వే (SCR) ప్ర‌యాణికుల ర‌ద్దీని పుర‌స్క‌రించుకుని సికింద్రాబాద్‌-సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్-హైద‌రాబాద్‌ మార్గంలో ప్ర‌త్యేక రైళ్ల‌ను (Special Trains) న‌డుపుతున్న‌ది. అక్టోబ‌ర్ 25 వ‌ర‌కు ఏకంగా 34 ప్ర‌త్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. ఈ రైళ్లు రెగ్యులర్‌ స్టాపేజీలతో పాటు యాదాద్రి రైల్వేస్టేషన్‌లోనూ అదనపు స్టాపేజీ సౌకర్యం కల్పించింది. దీంతో సెల‌వుల్లో యాదగిరిగుట్టకు వెళ్లే భక్తులకు కూడా ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయి. ఈ రైళ్లు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవచ్చని పేర్కొంది.

సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ డెయిలీ స్పెషల్ (రైలు నంబరు 07711): ఈ రైలు ప్రతిరోజు మధ్యాహ్నం 12.10 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. మొత్తం 17 సర్వీసులు ఈ మార్గంలో సేవ‌లు అందించ‌నున్నాయి.

సిర్పూర్ కాగజ్‌నగర్-హైదరాబాద్ డెయిలీ స్పెషల్ (రైలు నంబరు 07712): తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతిరోజు సాయంత్రం 18:00 (6:00) గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 23:15 గంటలకు హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్‌కు చేరుకుంటుంది. ఇవి కూడా 17 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

ఇరువైపులా చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్ స్టేషన్లలో ఆగుతాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు ఈ స్టాపేజీలు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.

Advertisement
Advertisement