Mahabubabad | 30 నెలల అద్దె బాకీ.. ఎంపీడీవో ఆఫీసుకు తాళం
Mahabubabad | గత 30 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో.. ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేశారు. దీంతో అధికారులు గంటల పాటు రోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది.
Mahabubabad | త్రినేత్ర.న్యూస్ : గత 30 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో.. ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేశారు. దీంతో అధికారులు గంటల పాటు రోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల కేంద్రంలో వెలుగు చూసింది.
పెద్దవంగర మండలంగా ఏర్పడినప్పటి నుంచి ఎంపీడీవో కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతుంది. అయితే గత 30 నెలల నుంచి ఇంటి యజమానికి అధికారులు అద్దె చెల్లించలేదు. గతంలో 8 నెలల అద్దె బకాయికి సంబంధించి రూ. 56 వేల చెక్కును అధికారులు సిద్ధం చేసి ఇచ్చారు. ఆ చెక్కును మరిపెడ ఎస్‌టీవోలో ఇవ్వగా.. వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ అఫ్రూవల్ అని ఆన్‌లైన్‌లో చూపిస్తున్నది. ఇప్పటికీ ఆ 8 నెలల అద్దె యజమానికి అందలేదు. దీంతో మొత్తం 30నెలల అద్దె రూ.2.10 లక్షలు బకాయిలు, అదేవిధంగా రూ. లక్షా 80 వేల కరెంట్ బిల్లు బకాయి ఉండడంతో యజమాని రాంపాక నారాయణ మంగళవారం ఉదయం కార్యాలయానికి తాళం వేశారు.
షాకైన ఎంపీడీవో..
ఇంటి యజమాని నారాయణ ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేయడంతో ఎంపీడీవోతో పాటు మిగతా సిబ్బంది షాకయ్యారు. గంటల పాటు రోడ్డుపైనే నిరీక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంపీడీవో వేణుమాధవ్ బకాయి ఉన్న అద్దెను చెల్లిస్తామని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని యజమానికి చెప్పాడు. దాంతో శాంతించిన నారాయణ.. చివరకు కార్యాలయానికి వేసిన తాళం తీయడంతో అధికారులు తమ పనుల్లో నిమగ్నమైపోయారు.
https://x.com/i/status/2010998253639319898
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



