Rabies Injection | ప్రభుత్వ దవాఖానలో రేబిస్ ఇంజెక్షన్ వికటించి చిన్నారి మృతి
Rabies Injection | కామారెడ్డి (Kamareddy) పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. కుక్కకాటుకు సంబంధించి ప్రభుత్వ దవాఖానలో మూడో డోసు టీకా (Rabies Injection) వేయించుకున్న కొద్దిసేపటికే రెండేండ్ల చిన్నారి మృతి చెందింది.
త్రినేత్ర.న్యూస్: కామారెడ్డి (Kamareddy) పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. కుక్కకాటుకు సంబంధించి ప్రభుత్వ దవాఖానలో మూడో డోసు టీకా (Rabies Injection) వేయించుకున్న కొద్దిసేపటికే రెండేండ్ల చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు.
కామారెడ్డి జిల్లా కొటాల్‌పల్లికి చెందిన కల్లూరి అర్చన- రమేశ్ దంపతులు జిల్లా కేంద్రంలోని అయప్పనగర్‌లో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో రెండేండ్ల బాలిక క్రితర్ష ఇంటి బయట ఆడుకుంటుండగా గత నెల 25న కుక్క కరిచింది. దీంతో కామారెడ్డి ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికే రెండు డోసుల రేబిస్ వ్యాక్సిన్ (Rabies Vaccine)వేయించారు. ఆదివారం మధ్యాహ్నం మూడో డోస్ వేశారు. అయితే టీకా వేసిన ఐదు నిమిషాలకే క్రితర్ష అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆందోళనకు గురైన రమేశ్ ఆమెను పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్‌కి తీసుకువెళ్లారే. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
దీంతో వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని ఆరోపిస్తూ బంధువులు, స్థానికులు జీజీహెచ్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. ఎమర్జెన్సీ వార్డు లోని ఈసీజీ మిషన్లు, అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం రోడ్డుపై ధర్నాకు దిగారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. డాక్టర్‌పై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, రేబిస్ వ్యాక్సిన్ వికటించే అవకాశం తక్కువని, మరణానికి గల కారణాలు తెలుసుకుంటామని జీజీహెచ్ ఆర్‌ఎంవో సంతోశ్ వెల్లడించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం






