Chupudu Velu Book Launch | వివక్ష లేని సమాజం కోసం కాశన్న కలం కదిలింది
Chupudu Velu Book Launch | వివక్ష లేని సమాజం కోసం ఎదిరేపల్లి కాశన్న (Edirepalli Kashanna) తన కలాన్ని కదిలించారని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, బహుజన ఉద్యమ కవి జూలూరు గౌరీ శంకర్ (Juloori Gouri Shankar) ప్రశంసించారు.
- రాజ్యాంగానికి రెండు వైపులా నిలిచే కాపలాదారుడే కవి
- చూపుడువేలు పుస్తకావిష్కరణ సభలో జూలూరు గౌరీ శంకర్
Chupudu Velu Book Launch | త్రినేత్ర న్యూస్: వివక్ష లేని సమాజం కోసం ఎదిరేపల్లి కాశన్న (Edirepalli Kashanna) తన కలాన్ని కదిలించారని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, బహుజన ఉద్యమ కవి జూలూరు గౌరీ శంకర్ (Juloori Gouri Shankar) ప్రశంసించారు. రాజ్యాంగానికి రెండు వైపులా నిలిచే కాపలాదారుడే కవి అని, నేటి కవులు రాజ్యాంగ రక్షకులుగా రచనలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రముఖ కవి ఎదిరేపల్లి కాశన్న కవిత్వ సంకలనం "చూపుడు వేలు" కవిత్వ గ్రంథాన్ని మంగళవారం రవీంద్రభారతిలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కాలం సోయితో కన్న కవి ఎదిరేపల్లి కాశన్న అని కొనియాడారు. కవులు, రచయితలు రాజ్యాంగాన్ని రక్షణ కవచంగా చేసుకొని సాహిత్య సృష్టి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఆధిపత్యాలపై ఉద్యమంగా రచనలు రావాలి
భారతదేశానికి మార్గదర్శకత్వం చేసేది అంబేద్కర్ చూపుడు వేలు అని పేర్కొన్నారు. అంబేద్కర్ చూపుడు వేలు నేడు దేశాన్ని నడిపిస్తుందన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అన్ని రకాల ఆధిపత్యాలపై ఉద్యమంగా రచనలు చేయడమే నేటి సాహిత్య రంగం కర్తవ్యం అన్నారు. వివక్షలు లేని సమాజం కోసం కాశన్న చూపుడు వేలు కవిత్వం రాశారని పేర్కొన్నారు. జ్యోతిబాపూలే, అంబేద్కర్ల ఆలోచనలే దేశానికి దిశా నిర్దేశం చేయగలవని నమ్మకం విశ్వాసం అన్ని వర్గాల్లో పెరుగుతుందన్నారు. కాశన్న మాదిగ ఉద్యమంపై మహత్తర కవిత్వం రాశారని జూలూరు గౌరీ శంకర్ కొనియాడారు.
"ఎదిరేపల్లి కాశన్న కవిత్వం పూలే, అంబేద్కర్, మారోజు వీరన్న లాంటి మహనీయుల స్ఫూర్తితో రాసిన కవిత్వం. దళితులు, బహుజనులు సామాజిక న్యాయం కోసం నిరంతరం అక్షర పోరాటం చేయాలి" అని పిలుపునిచ్చారు. కాశన్న కవిత్వం భారతదేశంలోని అనేక సంఘటనల సమాహారమని, ప్రతి గాయాన్ని, ప్రతి వివక్షను తన కవితల ద్వారా ఎత్తిచూపాడని, కాశన్న నిఖార్సయిన దళిత, బహుజన, శ్రామిక కవి అని కొనియాడారు.
కవులను సత్కరించే సహృదయుడు
విశిష్ట అతిథిగా హాజరైన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ... "ఎదిరేపల్లి కాశన్న కవిత్వం అవమానాల అగాధాల నుంచి, వెలివేతల విషాదం నుంచి, నిర్బంధాల చీకట్ల నుంచి మొలకెత్తిన అక్షరం. నిరంతరం ప్రజల పక్షాన నిలిచిన కలం ఆయనది. కవిత్వం రాయడమే కాకుండా, అమ్మ ఎదిరేపల్లి మశమ్మ స్మారక ఫౌండేషన్ పేరుపై రూ.20 వేల నగదు పురస్కారాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. కవిత్వం రాయడంతో పాటు ప్రతిభ కలిగిన కవులను, విమర్శకులను, సాహిత్య పరిశోధకులను, చరిత్రకారులను సత్కరించే సహృదయం కాశన్నది" అని అన్నారు.
"చూపుడు వేలు" కవిత్వాన్ని ప్రముఖ కవి గుడిపల్లి నిరంజన్ పరిచయం చేస్తూ... "ఎదిరేపల్లి కాశన్న సామాజిక పరిస్థితులపై, దుస్థితులపై, అసమానతలపై, పేదల అవస్థలపై తిరుగులేని ప్రభావంతో కవిత్వం రాశారు. పాలకుల పెత్తందారీతనంపై అంబేద్కర్ ఆలోచనలతో లోతైన కవిత్వం రాశారు. కాశన్న కవిత్వంలో సమకాలీన దళిత ఉద్యమాలు, దళితుల కొత్త రాజకీయ చైతన్యం, అంబేద్కర్ ఇజం, మార్క్సిజం కలగలిసిన దేశీయ మార్క్సిజం తాత్విక పునాదులపై నిలబడింది" అని తెలియజేశారు.
అంతకుముందు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఎదిరేపల్లి మశమ్మ స్మారక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆవిష్కరణ సభ జరిగింది. సభకు వనపట్ల సుబ్బయ్య అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో మానవతావాది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాతీయ అధ్యక్షులు జెట్టి ధర్మరాజు, కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వర రెడ్డి, మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు వి. వెంకటేశ్వరరావు, నాగవరం బాల్ రాజ్, చింతలపల్లి భాస్కరరావు, నాగపూరి విష్ణు, పూల్జాల గెల్వయ్య, దేవరపల్లి ప్రభాకర్, కందికొండ మోహన్, కల్వకోలు మద్దిలేటి, దేవరపల్లి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Attender Manideep Kumar Funerals | అటెండర్ మణిదీప్ పాడె మోసి.. చెల్లెలి చదువు, పెళ్లిపై హామీ ఇచ్చి
నవంబర్ 24, 2026

Vakiti Srihari | పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులిస్తం
నవంబర్ 24, 2026

BRTU Felicitation Telangana Bhavan | కొత్త లేబర్ కోడ్ల తర్వాత తొలి ఎన్నిక.. 51% ఓట్లతో చరిత్ర
నవంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Attender Manideep Kumar Funerals | అటెండర్ మణిదీప్ పాడె మోసి.. చెల్లెలి చదువు, పెళ్లిపై హామీ ఇచ్చి
- ●Sampath Nandi | సెన్సార్ అడ్డంకులకు కారణమదే - ఐటెంసాంగ్స్ ఉండవు - "భోగి"పై సంపత్ నంది కామెంట్స్
- ●Rising Stars Asia Cup | వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 53 బంతుల్లో 204 పరుగులు..!
- ●Vakiti Srihari | పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులిస్తం
- ●Web Series | పాకిస్థాన్ వెబ్‌సిరీస్‌ను బ్యాన్ చేయాలి - మోదీకి లేఖ రాసిన సినీ వర్కర్స్ అసోసియేషన్
- ●BRTU Felicitation Telangana Bhavan | కొత్త లేబర్ కోడ్ల తర్వాత తొలి ఎన్నిక.. 51% ఓట్లతో చరిత్ర

Attender Manideep Kumar Funerals | అటెండర్ మణిదీప్ పాడె మోసి.. చెల్లెలి చదువు, పెళ్లిపై హామీ ఇచ్చి

Sampath Nandi | సెన్సార్ అడ్డంకులకు కారణమదే - ఐటెంసాంగ్స్ ఉండవు - "భోగి"పై సంపత్ నంది కామెంట్స్

Rising Stars Asia Cup | వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 53 బంతుల్లో 204 పరుగులు..!

Vakiti Srihari | పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులిస్తం




