REDMI 15A 5G | చవక ధరకే షియోమీ కొత్త రెడ్‌మీ స్మార్ట్ ఫోన్.. భారీ బ్యాటరీ, 4 ఏళ్ల వరకు ఓఎస్ అప్‌డేట్స్..
REDMI 15A 5G | మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్ ఫోన్ రెడ్‌మీ 15ఎ 5జి ని భారత మార్కెట్‌లో శుక్రవారం విడుదల చేసింది. కంపెనీకి చెందిన లేటెస్ట్ 5జి ఫోన్ ఇదే కాగా ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం.
Technology | Published On Mar 27, 2026, 7.37 pm IST
REDMI 15A 5G | మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్ ఫోన్ రెడ్‌మీ 15ఎ 5జి ని భారత మార్కెట్‌లో శుక్రవారం విడుదల చేసింది. కంపెనీకి చెందిన లేటెస్ట్ 5జి ఫోన్ ఇదే కాగా ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ఫోన్‌లో 6.9 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేయగా, దీనికి హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. ముందు వైపు నాచ్‌లో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్ లో యూనిసోక్ టి8300 ప్రాసెసర్ ఉంది. 6జీబీ ర్యామ్ లభిస్తుంది. ర్యామ్‌ను అదనంగా మరో 6జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే సదుపాయం కల్పించారు. అందువల్ల ఫోన్ ఎలాంటి ల్యాగ్ లేకుండా వేగంగా పనిచేస్తుంది.
భారీ బ్యాటరీ, 4 ఏళ్ల వరకు ఓఎస్ అప్‌డేట్స్..
ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత షియోమీ హైపర్ ఓఎస్3.0ను ఇచ్చారు. ఈ ఫోన్‌కు 4 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో వెనుక వైపు 32 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఇవ్వగా, మరో సెకండరీ కెమెరాను సైతం ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఆథెంటికేషన్ కోసం ఇచ్చారు. 6300 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఇందులో ఉంది. దీనికి 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు. దీని వల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది. ఫోన్‌తోపాటు చార్జర్‌ను కూడా బాక్సులో ఇస్తున్నారు. 3 ఏళ్లపాటు ఈ ఫోన్‌ను ఉపయోగించినా లేదా 1000 చార్జింగ్ సైకిల్స్ పూర్తయినా కూడా ఈ ఫోన్ 80 శాతం బ్యాటరీ హెల్త్‌ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. అందువల్ల ఫోన్ ఎక్కువ కాలం మన్నికగా పనిచేస్తుందని వెల్లడించింది. ఇక ఈ ఫోన్‌కు 7.5 వాట్ల రివర్స్ వైర్డ్ చార్జింగ్ సదుపాయాన్ని కూడా ఇచ్చారు. దీంతో ఇతర ఫోన్‌లు లేదా డివైస్‌లను సైతం చార్జింగ్ చేసుకోవచ్చు.
డెడికేటెడ్ మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్..
ఈ ఫోన్ డిస్‌ప్లేకు సూర్యకాంతిలోనూ స్పష్టంగా వీక్షించేలా 810 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. 4జీబీ, 6జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. డ్యుయల్ సిమ్ స్లాట్లతోపాటు డెడికేటెడ్ మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్‌ను ఇచ్చారు. 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో సదుపాయాలు ఉన్నాయి. ఐపీ52 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి కనెక్టివిటీ సదుపాయాలను ఇచ్చారు.
ధర వివరాలు..
షియోమీ రెడ్‌మీ 15ఎ 5జి ఫోన్‌ను ఆసమ్ బ్లూ, అమేజ్ పర్పుల్, ఏస్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.12,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.14,499గా నిర్ణయించారు. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,499గా ఉంది. ఈ ఫోన్‌ను ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఏప్రిల్ 3 నుంచి విక్రయించనున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



