vivo Y51 Pro 5G | 7200 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన వివో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
vivo Y51 Pro 5G | స్మార్ట్ ఫోన్ తయారీదారు వివో నూతనంగా వై51 ప్రొ 5జి పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. గతేడాది విడుదల చేసిన వై51 ప్రొకు 5జి వెర్షన్‌గా దీన్ని కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం.
Technology | Published On Mar 13, 2026, 11.33 am IST
vivo Y51 Pro 5G | స్మార్ట్ ఫోన్ తయారీదారు వివో నూతనంగా వై51 ప్రొ 5జి పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. గతేడాది విడుదల చేసిన వై51 ప్రొకు 5జి వెర్షన్‌గా దీన్ని కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ఫోన్‌లో 6.75 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. అలాగే సూర్యకాంతిలోనూ డిస్‌ప్లేను స్పష్టంగా వీక్షించేలా 1250 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను ఇస్తున్నారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 ప్రాసెసర్‌ను ఇచ్చారు. దీని వల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. అలాగే ఐపీ68, ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా దీనికి ఉంది.
భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ క్వాలిటీ..
మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలతో ఈ ఫోన్‌ను రూపొందించామని, కనుక దృఢమైన బిల్డ్ క్వాలిటీని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. 1.7 మీటర్ల ఎత్తు నుంచి ఫోన్ కింద పడినా అంత సులభంగా పగలదని స్పష్టం చేసింది. ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, దీనికి తోడుగా మరో 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరాను కూడా ఇచ్చారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. 7200 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఈ ఫోన్‌లో ఇచ్చారు. దీనికి 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇచ్చారు. అందువల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. యూఎస్‌బీ టైప్ సి ఆడియోను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి వంటి కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి.
ధర వివరాలు..
వివో వై51 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్‌ను ఫెస్టివ్ రెడ్, నోబుల్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.24,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.27,999గా ఉంది. వివో అధికారిక ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, ఇతర పార్ట్‌నర్ రిటెయిల్ స్టోర్స్‌లో ఈ ఫోన్లను ప్రస్తుతం విక్రయిస్తున్నారు. లాంచింగ్ సందర్భంగా పలు ఆఫర్లను సైతం అందిస్తున్నారు. మార్చి 16 లోపు ఈ ఫోన్‌ను కొన్నవారికి రూ.2500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. జీరో డౌన్ పేమెంట్ సదుపాయం కూడా ఉంది. జియో వినియోగదారులు అయితే ఈ ఫోన్‌ను కొన్న అనంతరం రూ.1199 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే 6 నెలల పాటు 10 ఓటీటీ యాప్‌లకు ఉచిత ప్రీమియం యాక్సెస్ లభిస్తుంది. ఇక స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్, అదనపు వారంటీ ప్లాన్‌లపై మార్చి 14 వరకు ఏకంగా 70 శాతం రాయితీ, మార్చి 31 వరకు 40 శాతం రాయితీలను అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



