Vivo X200T | 50MP ట్రిపుల్ రియర్ కెమెరాలతో లాంచ్ అయిన వివో కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్..!
Vivo X200T | మొబైల్స్ తయారీదారు వివో మరో నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లో ఎక్స్200టి పేరిట విడుదల చేసింది. ఎక్స్200 సిరీస్‌లో కంపెనీకి చెందిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు.
Technology | Published On Jan 27, 2026, 12.50 pm IST
Vivo X200T | మొబైల్స్ తయారీదారు వివో మరో నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లో ఎక్స్200టి పేరిట విడుదల చేసింది. ఎక్స్200 సిరీస్‌లో కంపెనీకి చెందిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే ఉండగా, ఇది 1.5కె రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. కనుక డిస్ ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఇక ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9400ప్లస్ లేటెస్ట్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేకమైన వీసీ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందిస్తున్నారు. కనుక ఫోన్‌ను గేమింగ్ లేదా మూవీ స్ట్రీమింగ్ కోసం ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత త్వరగా హీట్‌కు గురి కాదు. అలాగే ఇందులో 12జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో వెనుక వైపు 50MP మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. మరో 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ కూడా ఉంది. అలాగే 50MP టెలిఫొటో కెమెరాను కూడా ఇచ్చారు. దీంతో 100ఎక్స్ హైపర్ జూమ్ లభిస్తుంది. ఫొటోలు, వీడియోలను నాణ్యంగా చిత్రీకరించుకోవచ్చు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 ను అందిస్తున్నారు. దీనికి గాను 5 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్ లభిస్తాయి. మరో 7 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్‌ను ఇస్తామని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్‌కు ఐపీ 68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌ను కూడా అందిస్తున్నారు. 6200 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇచ్చారు. 90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు ఇందులో సపోర్ట్ లభిస్తుంది. 40 వాట్ల వైర్‌లెస్ చార్జింగ్‌కు కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
సూర్యకాంతిలోనూ స్పష్టంగా వీక్షించేలా ఈ ఫోన్‌కు 5000 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్ ఫీచర్‌ను అందిస్తున్నారు. 12జీబీ, 16జీబీ ర్యామ్ ఆప్షన్లు, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో లభిస్తున్నాయి. డ్యుయల్ సిమ్ లను వేసుకోవచ్చు. ముందు వైపు 32MP కెమెరాను ఇచ్చారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు.
ధర వివరాలు..
వివో ఎక్స్200టి ఫోన్‌ను సీసైడ్ లిలాక్, స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.59,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.69,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను ప్రస్తుతం వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ ఆర్డర్ల కోసం అందుబాటులో ఉంచారు. ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆఫ్ లైన్ స్టోర్‌లలో విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై పలు ఆఫర్లను సైతం అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకు కార్డులతో ఈ ఫోన్‌పై రూ.5వేల వరకు ఫ్లాట్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరో రూ.5వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా ఇస్తున్నారు. అలాగే 18 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. 1 ఏడాది వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీని కూడా పొందవచ్చు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



