త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

vivo T5x 5G | 7200ఎంఏహెచ్ బ్యాట‌రీతో లాంచ్ అయిన వివో టీ5ఎక్స్ 5జి ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

vivo T5x 5G | మొబైల్స్ త‌యారీదారు వివో త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ టీ5ఎక్స్ 5జి ని భార‌త మార్కెట్‌లో మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. గ‌తేదాడి టీ4ఎక్స్ 5జి ఫోన్‌ను విడుద‌ల చేయ‌గా, దానికి కొన‌సాగింపుగా ఇప్పుడు టీ5ఎక్స్ 5జిని లాంచ్ చేశారు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉంది.

S

Technology | Published On Mar 17, 2026, 1.35 pm IST

vivo T5x 5G  | 7200ఎంఏహెచ్ బ్యాట‌రీతో లాంచ్ అయిన వివో టీ5ఎక్స్ 5జి ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?
Advertisement

vivo T5x 5G | మొబైల్స్ త‌యారీదారు వివో త‌న నూత‌న స్మార్ట్ ఫోన్ టీ5ఎక్స్ 5జి ని భార‌త మార్కెట్‌లో మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. గ‌తేదాడి టీ4ఎక్స్ 5జి ఫోన్‌ను విడుద‌ల చేయ‌గా, దానికి కొన‌సాగింపుగా ఇప్పుడు టీ5ఎక్స్ 5జిని లాంచ్ చేశారు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉంది. ఈ ఫోన్‌లో 6.76 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. క‌నుక ఫోన్ డిస్ ప్లే అద్భుత‌మైన క్వాలిటీని క‌లిగి ఉంటుంది. నాణ్య‌మైన దృశ్యాల‌ను తెర‌పై వీక్షించ‌వ‌చ్చు. ఈ ఫోన్‌కు ముందు వైపు 32 మెగాపిక్స‌ల్ కెమెరాను పంచ్ హోల్‌లో ఇచ్చారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. 7200 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీ కూడా ఉంది.

మిలిట‌రీ గ్రేడ్ క్వాలిటీతో..

ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఫ‌న్ ట‌చ్ ఓఎస్ 6ను ఇచ్చారు. ఈ ఫోన్‌కు 2 ఏళ్ల వ‌ర‌కు ఆండ్రాయిడ్ అప్ డేట్స్‌ను, 4 ఏళ్ల వ‌ర‌కు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామ‌ని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌కు 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను ఇచ్చారు. క‌నుక ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది. అలాగే ఐపీ68, 69 డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. వెనుక వైపు 50 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను ఇవ్వ‌గా, మ‌రో 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌ను సైతం ఇచ్చారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ స‌దుపాయం ఉంది. మిలిట‌రీ గ్రేడ్ నాణ్య‌త‌తో ఈ ఫోన్‌ను రూపొందించామని, క‌నుక ఫోన్ దృఢ‌మైన బిల్డ్ క్వాలిటీని క‌లిగి ఉంటుంద‌ని కంపెనీ తెలిపింది.

క‌నెక్టివిటీ ఫీచ‌ర్లు..

6జీబీ, 8జీబీ ర్యామ్‌, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. ఈ ఫోన్ కెమెరాల‌తో నాణ్య‌మైన 4కె వీడియోల‌ను రికార్డు చేయ‌వ‌చ్చు. ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ స‌దుపాయం కూడా ఉంది క‌నుక ఫోన్‌ను ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల కోసం యూనివ‌ర్స‌ల్ రిమోట్‌గా కూడా రిమోట్ యాప్ స‌హాయంతో ఉప‌యోగించుకోవ‌చ్చు. యూఎస్‌బీ టైప్ సి ఆడియోను ఈ ఫోన్ స‌పోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీక‌ర్ల‌ను ఇచ్చారు. 5జి సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి వంటి క‌నెక్టివిటీ ఫీచ‌ర్ల‌ను ఇచ్చారు.

ధ‌ర‌, ఆఫ‌ర్లు..

వివో టీ5ఎక్స్ 5జి ఫోన్‌ను స్టార్ సిల్వ‌ర్‌, సైబ‌ర్ గ్రీన్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.18,999 ఉండ‌గా, 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.20,999గా నిర్ణ‌యించారు. 8జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధర రూ.22,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌, పార్ట్‌న‌ర్ రిటెయిల్ స్టోర్స్‌లో మార్చి 24 నుంచి విక్ర‌యించ‌నున్నారు. లాంచింగ్ సంద‌ర్భంగా ఈ ఫోన్‌పై యాక్సిస్ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ కార్డులు, యూపీఐ కొనుగోళ్ల‌తో రూ.2వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. 6 నెల‌ల వ‌ర‌కు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం కూడా ఉంది. జియో ప్రీపెయిడ్ వినియోగ‌దారులు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసి రూ.1199 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే 6 నెల‌ల పాటు ఉచితంగా 10 ఓటీటీ యాప్‌ల‌కు ప్రీమియం యాక్సెస్‌ను పొంద‌వ‌చ్చు.

Advertisement
Advertisement