vivo T5 Pro 5G | 9020 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన వివో టి5 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..?
vivo T5 Pro 5G | మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్ ఫోన్ వివో టి5 ప్రొ 5జిని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకర్షణీయమైన ఫీచర్లను ఇచ్చారు. మిడ్ రేంజ్ విభాగంలో వచ్చిన ఈ ఫోన్‌లో 6.83 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 1.5కె రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.
Technology | Published On Apr 15, 2026, 3.06 pm IST
vivo T5 Pro 5G | మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్ ఫోన్ వివో టి5 ప్రొ 5జిని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకర్షణీయమైన ఫీచర్లను ఇచ్చారు. మిడ్ రేంజ్ విభాగంలో వచ్చిన ఈ ఫోన్‌లో 6.83 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 1.5కె రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అందువల్ల డిస్‌ప్లే అద్భుతమైన క్లారిటీని ఇస్తుంది. ఔట్ డోర్‌లోనూ డిస్‌ప్లేను స్పష్టంగా చూసేలా ఈ ఫోన్‌కు 1600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్4 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా 7కె వీసీ కూలింగ్ సిస్టమ్‌ను ఇచ్చారు. అందువల్ల ఫోన్‌ను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత త్వరగా హీట్ కు గురి కాదు.
9020 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఇచ్చారు. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సదుపాయం ఉంది. దీని వల్ల ఫోన్ కదులుతున్నా ఫొటోలు లేదా వీడియోలను కుదుపులు లేకుండా చిత్రీకరించుకోవచ్చు. ఇక వెనుక వైపు మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌ను ఇచ్చారు. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత ఆరిజిన్ ఓఎస్6తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌కు 3 ఏళ్ల వరకు ఓఎస్ అప్‌డేట్స్, 5 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్‌ను ఇస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌లో 9020 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఇచ్చారు. ఈ ఫోన్ కు బ్యాటరీని ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. దీనికి 90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు. అందువల్ల ఫోన్ ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 37 నిమిషాల్లోనే సున్నా నుంచి 50 శాతం వరకు చార్జింగ్ అవుతుంది.
మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో..
ఈ ఫోన్ కేవలం 8.25 మిల్లీమీటర్ల మందాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. అందువల్ల ఫోన్ అత్యంత స్లీక్‌గా, ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. ఇక ఈ ఫోన్‌లో ఉన్న బ్యాటరీ 5 ఏళ్ల వరకు నిరాటంకంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌కు ఐపీ 68, 69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను కూడా ఇచ్చారు. ఈ ఫోన్ డిస్‌ప్లేకు హెచ్‌డీఆర్ 10 ప్లస్ రేటింగ్ ఉన్నందున హైక్వాలిటీ వీడియోలను తిలకించవచ్చు. 8జీబీ, 12జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ లేదు. ఇన్ డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో ఈ ఫోన్‌ను రూపొందించారు. అందువల్ల బిల్డ్ క్వాలిటీ చాలా దృఢంగా ఉంటుంది. అంత సులభంగా పగలదు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్ సి వంటి కనెక్టివిటీ సదుపాయాలను ఇచ్చారు.
ధర ఎంతంటే..?
వివో టి5 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్‌ను కాస్మిక్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.29,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.33,999 గా ఉంది. అలాగే 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ టాప్ మోడల్ ధర రూ.39,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈనెల 21 నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డులతో ఈ ఫోన్‌ను కొంటే రూ.3వేల డిస్కౌంట్ ఇస్తారు. రూ.3వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. అలాగే 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



