Vivo | భారీ బ్యాటరీతో లాంచ్ అయిన వివో కొత్త స్మార్ట్ ఫోన్లు.. ధర తక్కువే..
Vivo | మొబైల్స్ తయారీదారు వివో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు వై21 5జి, వై11 5జిలను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. వై సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ వివో ఫోన్లు ఇవే కాగా, ఈ ఫోన్లను గ్రేటర్ నోయిడాలోని కంపెనీ పరిశ్రమలో తయారు చేస్తున్నట్లు వివో తెలిపింది.
Technology | Published On Mar 25, 2026, 2.37 pm IST
Vivo | మొబైల్స్ తయారీదారు వివో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు వై21 5జి, వై11 5జిలను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. వై సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ వివో ఫోన్లు ఇవే కాగా, ఈ ఫోన్లను గ్రేటర్ నోయిడాలోని కంపెనీ పరిశ్రమలో తయారు చేస్తున్నట్లు వివో తెలిపింది. బ్యాటరీ బ్యాకప్, ఎక్కువ కాలం పాటు మన్నిక, రోజువారి పనులకు చక్కని ప్రదర్శన ఇచ్చే ఫోన్ కావాలని కోరుకునే వారికి ఈ ఫోన్లు ఉత్తమ ఆప్షన్ గా నిలుస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్లలో పలు ఫీచర్లను కామన్‌గా అందిస్తున్నట్లు తెలియజేసింది. ఈ రెండింటిలోనూ 6.74 ఇంచుల డిస్‌ప్లే ఉండగా, దీనికి హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇచ్చారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. ఈ రెండు ఫోన్లలోనూ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఇచ్చారు.
6500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ..
వివో వై21 5జి ఫోన్‌లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడు మరో సెకండరీ కెమెరాను ఇచ్చారు. వివో వై11 5జి ఫోన్‌లో వెనుక వైపు 13 మెగాపిక్సల్ కెమెరా ఉంది. రెండు ఫోన్లలోనూ ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. వీటిల్లో 6500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేశారు. వై21 5జి ఫోన్‌లో 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ను ఇస్తుండగా, వై11 5జి ఫోన్ లో 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ను ఇచ్చారు. వై21 5జి ఫోన్ షాంపేన్ గోల్డ్, మిడ్ నైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో విడుదల కాగా, వై11 5జి ఫోన్‌ను సన్‌రైజ్ గోల్డ్, మిడ్ నైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు.
5 ఏళ్ల వరకు వాడుకోవచ్చు..
ఈ రెండు ఫోన్లలోనూ భారీ బ్యాటరీ ఉన్నందున ఫోన్‌లను పూర్తి స్థాయిలో చార్జింగ్ చేస్తే 48.4 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను, 80 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్‌ను అందిస్తాయని కంపెనీ తెలిపింది. సాఫ్ట్‌వేర్ పరంగా సూపర్ బ్యాటరీ సేవర్ మోడ్‌ను ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో బ్యాటరీ లైఫ్ పెరుగుతుందని తెలిపింది. అలాగే బ్యాటరీ వినియోగం కూడా సరిగ్గా ఉంటుందని పేర్కొంది. ఈ రెండు ఫోన్లను కూడా 5 ఏళ్ల వరకు ఎలాంటి బ్యాటరీ సమస్య లేకుండా ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలియజేసింది. వీటికి ఐపీ65 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను ఇచ్చారు. మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలతో వీటిని రూపొందించారు. కనుక వీటి బిల్డ్ క్వాలిటీ దృఢంగా ఉంటుంది. ఆథెంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సదుపాయాన్ని కూడా వీటిల్లో ఇచ్చారు.
ఏఐ ఫీచర్లు కూడా..
ఈ ఫోన్లలో ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 16 డిఫాల్ట్‌గా లభిస్తుంది. సూర్యకాంతిలోనూ స్పష్టంగా తెరను వీక్షించేలా వీటికి 1200 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చారు. పలు ఏఐ ఫీచర్లను కూడా ఈ ఫోన్లలో ఇస్తున్నారు. గూగుల్ జెమినితోపాటు ఏఐ ఫొటో ఎన్‌హాన్స్, ఏఐ డాక్యుమెంట్ వంటి ఫీచర్లను యూజర్లు ఉపయోగించుకోవచ్చు. అలాగే సర్కిల్ టు సెర్చ్ విత్ గూగుల్ అనే సదుపాయం సైతం అందుబాటులో ఉంది. 5జి సిమ్‌లను వేసుకోవచ్చు. యూఎస్‌బీ టైప్ సి, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ సదుపాయాలను వీటిల్లో ఇచ్చారు.
ధర ఎంతంటే..
ఈ ఫోన్లను ప్రస్తుతం వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, ఇతర భాగస్వామ్య రిటెయిల్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు. వివో వై21 5జి ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.18,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.20,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.22,999గా నిర్ణయించారు. ఇక వివో వై11 5జి ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999 ఉండగా, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.16,999గా నిర్ణయించారు. వివో వై21 5జి ఫోన్‌ను కొనుగోలు చేస్తే వినియోగదారులు రూ.1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను క్యాష్ బ్యాక్ రూపంలో పొందవచ్చు. పలు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. వై11 5జి ఫోన్‌ను కొంటే రూ.1వేయి క్యాష్ బ్యాక్ ఇస్తారు. జీరో డౌన్ పేమెంట్ పద్ధతిలో ఈ ఫోన్లను కొనవచ్చు. 8 నెలల వరకు అవకాశం ఉంటుంది. జియో వినియోగదారులు ఈ ఫోన్లను కొనుగోలు చేసిన అనంతరం రూ.1199 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే 2 నెలల పాటు ఉచితంగా 10 ఓటీటీ యాప్‌లకు ప్రీమియం యాక్సెస్‌ను పొందవచ్చు. ఫోన్లకు వి-షీల్డ్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను కూడా ఉచితంగా ఇస్తున్నారు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



