త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Reliance Jio 5G | 5జి రేసులో దూసుకుపోతున్న జియో.. చాలా వెనుక‌బ‌డ్డ ఎయిర్‌టెల్‌..

Reliance Jio 5G | భార‌త్ లో 4జి సేవ‌లు అప్పుడ‌ప్పుడే ప్రారంభం అవుతున్న వేళ టెలికాం రంగంలోకి రిల‌య‌న్స్ జియో ఓ సంచ‌ల‌నంలా వ‌చ్చింది. కొన్ని నెల‌ల పాటు ఉచితంగా హైస్పీడ్ 4జి డేటాను, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను అందించింది. దీంతో వినియోగ‌దారులు పెద్ద ఎత్తున ఇత‌ర నెట్ వ‌ర్క్‌ల నుంచి జియోలోకి మారారు.

S

Technology | Published On Dec 30, 2025, 9.46 am IST

Reliance Jio 5G | 5జి రేసులో దూసుకుపోతున్న జియో.. చాలా వెనుక‌బ‌డ్డ ఎయిర్‌టెల్‌..
Advertisement

Reliance Jio 5G | భార‌త్ లో 4జి సేవ‌లు అప్పుడ‌ప్పుడే ప్రారంభం అవుతున్న వేళ టెలికాం రంగంలోకి రిల‌య‌న్స్ జియో ఓ సంచ‌ల‌నంలా వ‌చ్చింది. కొన్ని నెల‌ల పాటు ఉచితంగా హైస్పీడ్ 4జి డేటాను, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను అందించింది. దీంతో వినియోగ‌దారులు పెద్ద ఎత్తున ఇత‌ర నెట్ వ‌ర్క్‌ల నుంచి జియోలోకి మారారు. ఆ త‌రువాత అందులో ఉన్న స‌దుపాయాల‌ను చూసి అదే నెట్‌వ‌ర్క్‌లో చాలా మంది ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నారు. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు చాలా మంది కొత్త క‌స్ట‌మ‌ర్లు కూడా జియోలో చేరుతున్నారు. అలాగే 5జి సేవ‌లు ప్రారంభం అయ్యాక కూడా జియో హ‌వా కొన‌సాగుతూనే ఉంది. దేశంలో ఇత‌ర టెలికాం సంస్థ‌లు జియోకు పోటీ ఇవ్వ‌లేక‌పోతున్నాయి. ఎయిర్‌టెల్ కూడా విస్తృత‌మైన‌ 5జి నెట్‌వ‌ర్క్‌ను క‌లిగి ఉంది. కానీ వినియోగ‌దారులు మాత్రం జియో 5జి సేవ‌ల‌ను వాడేందుకే ఆస‌క్తిని చూపిస్తున్న‌ట్లు గణాంకాల ద్వారా వెల్ల‌డవుతోంది.

జియోలోనే ఎక్కువ సేపు..

ఓపెన్ సిగ్న‌ల్ అనే నెట్‌వ‌ర్క్ ఇంటెలిజెన్స్ కంపెనీ తాజాగా భార‌త్‌లోని టెలికాం సంస్థ‌ల నెట్‌వ‌ర్క్‌, వినియోగ‌దారుల‌కు అందుతున్న సేవ‌ల‌పై ప‌లు గ‌ణాంకాలను విడుద‌ల చేసింది. ఆ నివేదిక ప్ర‌కారం దేశంలో జియో, ఎయిర్‌టెల్ మాత్ర‌మే దాదాపుగా పోటాపోటీగా విస్తృత‌మైన 5జి నెట్ వ‌ర్క్‌ను క‌లిగి ఉన్న‌ట్లు తేలింది. జియో 5జి నెట్‌వ‌ర్క్ ల‌భ్య‌త 68.1 శాతం ఉండ‌గా, ఎయిర్‌టెల్ 5జి నెట్ వ‌ర్క్ ల‌భ్య‌త 66.6 శాతంగా ఉంది. అంటే 5జి నెట్‌వ‌ర్క్ ల‌భ్య‌త‌లో రెండు సంస్థ‌లు దాదాపుగా పోటా పోటీగా సేవ‌ల‌ను అందిస్తున్నాయి. అయితే 5జి నెట్‌వ‌ర్క్‌ను ఎక్కువ‌గా జియో యూజ‌ర్లే వాడుతున్నారు. ఎయిర్‌టెల్ యూజ‌ర్లు 5జిని స‌రిగ్గా వాడ‌డం లేదు. ఎయిర్ టెల్ వినియోగ‌దారులు ఆ సంస్థ‌కు చెందిన 5జి నెట్‌వ‌ర్క్ ను కేవ‌లం 28 శాతం మేర మాత్ర‌మే ఉప‌యోగిస్తున్నారు. ఇక జియో యూజ‌ర్లు ఆ సంస్థ‌కు చెందిన 5జి నెట్‌వ‌ర్క్‌ను ఏకంగా 67.3 శాతం మేర ఉప‌యోగిస్తున్నార‌ని ఓపెన్ సిగ్న‌ల్ వెల్ల‌డించింది.

ఎయిర్‌టెల్‌లో ఆ స‌మ‌స్య‌..

ఓపెన్ సిగ్న‌ల్ తెలియ‌జేసిన వివ‌రాల ప్ర‌కారం 5జి నెట్‌వ‌ర్క్‌ను ఎక్కువ‌గా జియో వినియోగ‌దారులే వాడుతండ‌డం విశేషం. జియోలో 5జి నెట్‌వ‌ర్క్ చాలా విస్తృతంగా అందుబాటులో ఉండ‌డంతోపాటు వినియోగ‌దారుల‌కు ఎక్క‌డా 5జి సిగ్న‌ల్ డ్రాప్ అవ‌డం లేదు. అందుక‌నే వారు ఎక్కువ‌గా జియో 5జి సేవ‌ల‌ను ఉప‌యోగిస్తున్నారు. ఇక ఎయిర్ టెల్ లో ప‌రిస్థితి అలా లేదు. ఎయిర్‌టెల్‌లో 5జి నెట్‌వ‌ర్క్ అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ కాసేపు ఆ నెట్‌వ‌ర్క్‌లో 5జిని వాడితే సిగ్నల్ 4జి కి మారుతోంది. దీంతో ఇంట‌ర్నెట్ స్పీడ్ గ‌ణనీయంగా త‌గ్గుతోంది. అందుక‌నే వినియోగ‌దారులు ఎయిర్‌టెల్‌లో 5జి సేవ‌ల‌ను ఎక్కువ సేపు వినియోగించుకోలేక‌పోతున్నార‌ని తేలింది. అయితే ఎయిర్‌టెల్ కావాల‌నే ఇలా చేస్తుందా, లేక నెట్‌వ‌ర్క్ లోప‌మా.. అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

జియో అందుక‌నే మెరుగ్గా ఉంది..

అయితే వాస్త‌వానికి ఎయిర్‌టెల్‌లో 5జి నెట్‌వ‌ర్క్ ఉన్న‌ప్ప‌టికీ దాన్ని ఆ సంస్థ ఎన్ఎస్ఏ (నాన్ స్టాండ‌లోన్ ఆర్కిటెక్చ‌ర్‌) ఆధారంగా ఏర్పాటు చేసింది. అంటే ఫోన్‌లో సిగ్న‌ల్ 5జి అనే చూపిస్తుంది. కానీ 4జి నెట్ వ‌ర్క్ ఆర్కిటెక్చ‌ర్ ఆధారంగా 5జి ప‌నిచేస్తుంది. క‌నుక‌నే 5జి నెట్‌వ‌ర్క్ అని ఉన్నా స్పీడ్ మాత్రం 4జి లాగే వ‌స్తుంది. ఈ క్ర‌మంలోనే వినియోగ‌దారులు ఇలాంటి నెట్‌వ‌ర్క్‌ను ఎక్కువ సేపు ఉప‌యోగించ‌లేరు. కాసేప‌టికి స్పీడ్ డ్రాప్ అవుతుంది. దీని వ‌ల్ల వినియోగ‌దారుల‌కు ఇబ్బంది క‌లుగుతుంది. వెంట‌నే వారు వేరే నెట్ వ‌ర్క్‌లోకి మారిపోతారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ది అదే. అందుక‌నే వినియోగ‌దారులు ఎయిర్‌టెల్ 5జిని ఎక్కువ సేపు ఉపయోగించ‌డం లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక జియోలో అలా కాదు. 5జి నెట్ వ‌ర్క్‌ను పూర్తిగా ఎస్ఏ (స్టాండ‌లోన్ ఆర్కిటెక్చ‌ర్‌) ఆధారంగా ఏర్పాటు చేశారు. అంటే ఆర్కిటెక్చ‌ర్ కూడా 5జినే. అలాగే నెట్‌వ‌ర్క్ కూడా 5జినే. క‌నుక‌నే జియో 5జి సేవ‌లు ఎయిర్‌టెల్ 5జి సేవ‌ల క‌న్నా మెరుగ్గా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే జియోలో గంట‌ల త‌ర‌బడి 5జి నెట్‌వ‌ర్క్ స్పీడ్ అలాగే ఉంటుంది. క‌నుకనే జియోను వినియోగ‌దారులు ఎక్కువ సేపు ఉప‌యోగిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఎయిర్‌టెల్ ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించి జియోతో పోటీ ప‌డుతుందా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement