BSNL Recharge Plan | బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. 70 రోజుల వ్యాలిడిటీ, హైస్పీడ్ డేటాతో రూ.599 కొత్త రీఛార్జ్ ప్లాన్..!
BSNL Recharge Plan | ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన కస్టమర్లకు సరికొత్త ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రోజంతా వీడియోలు చూడడం, ఆన్‌లైన్ గేమింగ్, వర్క్ ఫ్రం హోమ్ అవసరాల కోసం ఎక్కువ డేటా వినియోగించే యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్‌ను పరిచయం చేసింది.
BSNL Recharge Plan | ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన కస్టమర్లకు సరికొత్త ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రోజంతా వీడియోలు చూడడం, ఆన్‌లైన్ గేమింగ్, వర్క్ ఫ్రం హోమ్ అవసరాల కోసం ఎక్కువ డేటా వినియోగించే యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ రూ.599 ప్లాన్‌లో వినియోగదారులకు మొత్తం 70 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. తరచుగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. రోజుకు సుమారు రూ.9 కన్నా తక్కువ ఖర్చుతో 3జీబీ హైస్పీడ్ డేటా వస్తుంది. దాంతో పాటు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్ సౌకర్యం కల్పిస్తుంది. అలాగే ఉచిత నేషనల్ రోమింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు సైతం అందుబాటులో ఉంటాయి.
ఎంటర్‌టైన్‌మెంట్ కోసం..
ఈ రీఛార్జ్ ప్లాన్‌లో కేవలం డేటా, కాలింగ్ సౌకర్యాలకే పరిమితం కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యం కల్పించింది బీఎస్ఎన్ఎల్. రూ.599 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు బీ-టీవీ (BiTV) యాప్‌కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. దాంతో అదనపు ఖర్చు లేకుండా మొబైల్‌లోనే అనేక టీవీ ఛానళ్లు వీక్షించవచ్చు. అంతేకాకుండా కొన్ని ఎంపిక చేసిన ఓటీటీ షోలు కూడా ఉచితంగా చూడవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ తక్కువగా ఉండడం గమనార్హం.
జియో, ఎయిర్‌టెల్‌తో పోలిస్తే..
దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియోతో పోల్చితే బీఎస్ఎన్ఎల్ ఆఫర్ తక్కువ ధరకే లభిస్తోంది. జియోలో రోజుకు 3జీబీ డేటా అందించే ప్లాన్ ధర రూ.1199గా ఉంది. ఈ ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత 5జీ డేటా, ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. అదనంగా జియో కస్టమర్లకు జియో-హాట్‌స్టార్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్, 18 నెలల గూగుల్ జెమినీ ప్రో, జియో క్లౌడ్‌లో 50జీబీ ఉచిత స్టోరేజ్ వంటి అదనపు ప్రయోజనాలు అందిస్తోంది. భారతి ఎయిర్‌టెల్‌లో రోజుకు 3జీబీ డేటా కావాలంటే వినియోగదారులు మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎయిర్‌టెల్ రూ.1798 ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత 5జీ ఇంటర్నెట్, ఉచిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. అదనంగా ఈ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఒక సంవత్సరం పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం యాక్సెస్ కూడా అందిస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






