UPI | దేశవ్యాప్తంగా UPI సేవలకు అంతరాయం.. పనిచేయని పేమెంట్ యాప్‌లు..
UPI | దేశవ్యాప్తంగా మంగళవారం సాయంత్రం యూపీఐ (Unified Payments Interface) ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రముఖ పేమెంట్ యాప్‌లలో లావాదేవీలు విఫలమవడంతో అసంతృప్తి వ్యక్తమైంది.
Technology | Published On Feb 11, 2026, 1.02 pm IST
UPI | దేశవ్యాప్తంగా మంగళవారం సాయంత్రం యూపీఐ (Unified Payments Interface) ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రముఖ పేమెంట్ యాప్‌లలో లావాదేవీలు విఫలమవడంతో అసంతృప్తి వ్యక్తమైంది. అవుటేజ్ ట్రాకింగ్ వేదిక Downdetector ప్రకారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో యూపీఐ సేవలకు సంబంధించిన ఫిర్యాదులు ఒక్కసారిగా పెరిగాయి. దాదాపు 577 నివేదికలు నమోదైనట్లు డేటా వెల్లడించింది. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికలపై కూడా వినియోగదారులు విఫలమైన చెల్లింపులు, ఆలస్యమైన ఫండ్ ట్రాన్స్‌ఫర్‌లు, పనిచేయని క్యూ ఆర్ కోడ్ స్కాన్‌లపై ఫిర్యాదులు చేశారు.
పనిచేయని యాప్‌లు..
వినియోగదారుల ప్రకారం గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రధాన యూపీఐ యాప్‌లు ప్రభావితమయ్యాయి. యాప్‌లలో చెల్లింపులు లేదా నగదు ట్రాన్స్‌ఫర్ వంటి సేవలను ఉపయోగిస్తున్న సమయంలో service provider not available వంటి ఎర్రర్ మెసేజ్‌లు కనిపించాయని వినియోగదారులు తెలిపారు. Downdetector డేటా ప్రకారం సాయంత్రం 7:07 గంటల వరకు గూగుల్ పే కు సంబంధించి 141 ఫిర్యాదులు నమోదయ్యాయి. పేటీఎం వినియోగదారులు కూడా లావాదేవీలు విఫలమవుతున్నాయని తెలియజేశారు.
సాంకేతిక సమస్యలే కారణమా..?
అంతరాయం నేపథ్యంలో UPI down అయ్యిందా? అంటూ సోషల్ మీడియాలో వినియోగదారులు ప్రశ్నలు సంధించారు. విఫలమైన లావాదేవీల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేవారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుంచి వినియోగదారులు సమస్యలు ఎదుర్కొన్నట్లు నివేదికలు వచ్చాయి. సాయంత్రం పీక్ అవర్ సమయంలో ఈ అంతరాయం చోటుచేసుకోవడంతో డిజిటల్ చెల్లింపులపై ఆధారపడే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే ఇలా జరగడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ పలుమార్లు అందులోనూ సాయంత్రం సమయంలో UPI సేవలు ఎక్కువగా విఫలం అయ్యాయి. ఇక ఇందుకు ప్రత్యేక కారణాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలియజేయకపోయినా అప్పుడప్పుడు తలెత్తే సాంకేతిక సమస్యల వల్లే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇక కాసేపటికి వినియోగదారులు ఈ సేవలను యథావిధిగా ఉపయోగించుకుంటున్నట్లు స్పష్టమైంది.
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



