Train Seats Selection | IRCTC రైల్లో మీ సీటు మీరు సెలెక్ట్ చేసుకోలేరు.. ఎందుకంటే..
Technology | Published On Dec 15, 2025, 12.49 pm IST
Train Seats Selection | బస్ ప్రయాణం అయినా ఇబ్బంది పడేవారుంటారు కానీ ట్రెయిన్ జర్నీ అంటే ఎగిరి గంతేయని వారుండరు.. చిన్నప్పుడైతే ట్రెయిన్ లో విండో సీట్ వస్తే బాగుండును అని అనుకుంటాం.. ఇప్పటికీ కూడా విండో సీట్ కావాలనుకునే వారుంటారు. నిద్రప్రియులైతే అప్పర్ బెర్త్ వస్తే హ్యాపీగా పడుకోవచ్చు అనుకుంటారు. కానీ ఈ సీట్ల కేటాయింపు వెనుక సైన్స్ ఉందని తెలుసా. బస్ అంటే మనకు కావాలసిన సీట్ బుక్ చేసుకుంటాం. సినిమా హాల్ లో లేదా విమానాల్లో అయినా మనకు నచ్చిన సీట్ తీసుకుంటాం. కానీ ట్రెయిన్లో అలా కుదరదు. వాళ్లు ఏ సీట్ కేటాయిస్తే అదే తీసుకోవాలసి ఉంటుంది. అయితే అసలు ట్రెయిన్ లో సీట్ ఎలా కేటాయిస్తారు..? దానికోసం వారు ఎలాంటి క్రమపద్దతి అనుసరిస్తారు..? క్రమపద్దతి పాటించకపోతే ఏమవుతుంది..? అన్న వివరాలన్నీ చాలా మందికి తెలియవు. ఈ క్రమంలోనే పలువురు నిపుణులు ఈ వివరాలను వెల్లడిస్తున్నారు.
బుకింగ్ విధానం ఇలా ఉంటుంది..
ప్రయాణికుల బరువును అన్ని కోచ్‌ల్లో, అన్నివైపులా సమానంగా పంచేలా IRCTC సాఫ్ట్‌వేర్ టికెట్‌లను బుక్‌చేస్తుంది. ఒక రైలులో 10 స్లీపర్ క్లాస్ కోచ్‌లు (ఎస్ 1- ఎస్10) ఉన్నాయనుకుందాం. ఒక్కో కోచ్‌లో 72 సీట్లతో మొత్తం 720 సీట్లు ఉంటాయి. మొదటగా బుక్‌చేసుకునే వ్యక్తికి మధ్యభాగంలో అంటే ఎస్-5 బోగీలో సాఫ్ట్‌వేర్ సీటును కేటాయిస్తుంది. కోచ్‌లోనూ మిడిల్ సీటు నుంచి టిక్కెట్లను బుక్‌చేస్తుంది. అంటే 72 సీట్లుంటే 36వ సీటును కేటాయిస్తుంది. ఇక చివరగా బుక్‌చేసుకునే వ్యక్తికి ఎస్1 లేదా ఎస్ 10 బోగీలో సీటును బుక్‌చేస్తుంది.
బెర్త్ విషయంలోనూ మొదటగా లోయర్ బెర్త్, ఆ తర్వాత మిడిల్ బెర్త్, చివరకు అప్పర్‌బెర్త్‌ను కేటాయిస్తుంది. అలాకాకుండా ఒక క్రమపద్ధతి లేకుండా టికెట్‌లను కేటాయిస్తే.. కొన్ని బోగీలు పూర్తిగా నిండిపోయి, మరికొన్ని ఖాళీగా ఉండే అవకాశముంది. ఇలాంటి సమయాల్లో ములుపుల దగ్గర ట్రైన్ పడిపోయే ప్రమాదముంటుంది. కొన్ని బోగీలపై ఎక్కువ అపకేంద్రబలముంటే, మరికొన్నింటిపై తక్కువగా ఉంటుంది. ఫలితంగా రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఏర్పడుతుంది. కనుక రైలు ప్రమాదం బారిన పడకుండా ఉండేందుకు, రైలులో సీట్లను క్రమ పద్ధతిలో కేటాయించేందుకు ఇలా చేస్తారు. అందుకనే రైళ్లలో మనకు కావల్సిన సీట్లను ఎంచుకోలేము. భద్రతా చర్యల్లో భాగంగానే సీట్ల కేటాయింపును ఒక క్రమపద్దతిలో అలా చేస్తారు.
సంబంధిత వార్తలు

IRCTC | ఐఆర్సీటీసీ గుడ్‌న్యూస్.. రూ.17,600కే 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి టూర్ స్టార్ట్
మే 21, 2026

Train Accidents | రైళ్లలో వరుస అగ్నిప్రమాదాల వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం : రైల్వే శాఖ
మే 20, 2026

Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
మే 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



