త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

రైళ్ల‌లో లోయ‌ర్ బెర్తుల‌ను ఎలా కేటాయిస్తారో తెలుసా..? వివ‌రంగా చెప్పిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌..

S

Technology | Published On Dec 6, 2025, 5.34 pm IST

రైళ్ల‌లో లోయ‌ర్ బెర్తుల‌ను ఎలా కేటాయిస్తారో తెలుసా..? వివ‌రంగా చెప్పిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌..
Advertisement

సాధార‌ణంగా రైళ్ల‌లో ఏ త‌ర‌గ‌తికి చెందిన టిక్కెట్ల‌ను బుక్ చేసినా స‌రే బ‌స్సులు, విమానాల్లో మాదిరిగా కావ‌ల్సిన సీట్ల‌ను ఎంపిక చేసుకునే అవ‌కాశం ఉండ‌దు. ఈ క్ర‌మంలోనే ప్ర‌యాణికులు త‌మ సౌక‌ర్యార్థం త‌మ‌కు కావ‌ల్సిన సీటును రైలు టిక్కెట్ బుకింగ్ సంద‌ర్భంగా ఎంపిక చేసుకుంటారు. దీంతో వారు ఎంపిక చేసుకున్న సీట్లు ఉంటే అవి ల‌భిస్తాయి. లేదంటే ఇత‌ర సీట్ల‌ను కేటాయిస్తారు. ఈ క్ర‌మంలో చాలా మంది లోయ‌ర్ బెర్తులు కావాల‌ని ఆప్ష‌న్ ను ఎంపిక చేసుకుంటారు. కానీ అధిక శాతం మందికి ఈ బెర్త్ సీట్లు ల‌భించ‌వు. అయితే ఇందుకు కార‌ణాల‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆయ‌న రాజ్య‌స‌భ‌లో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు లిఖిత పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు.

ముందుగా వీరికే..

రైళ్ల‌లో ఏ త‌ర‌గ‌తికి చెందిన టిక్కెట్ల‌ను బుక్ చేసినా స‌రే ముందుగా వృద్ధులు, 45 ఏళ్ల‌కు పైబ‌డిన మ‌హిళ‌లు లేదా దివ్యాంగులు, గ‌ర్భిణీల‌కు సీట్ల‌ను కేటాయిస్తారు. వారికి కేటాయించిన త‌రువాత ఆ కోటాలో ఎవ‌రూ లేక‌పోతేనే లోయ‌ర్ బెర్త్‌ల‌ను సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు కేటాయిస్తారు. అందుక‌నే రైళ్ల‌లో చాలా వ‌ర‌కు సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు లోయ‌ర్ బెర్తులు ల‌భించ‌వు. ఇక ఆ కోటాలో ఉన్న ప్ర‌యాణికులు మిడిల్ లేదా అప్ప‌ర్ బెర్తుల్లో ఉంటే వారికి లోయ‌ర్ బెర్త్‌కు మారేందుకు అవ‌కాశం ముందుగా ఇస్తారు. ఆ త‌రువాతే సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు ఆ అవ‌కాశం ఉంటుంది. ఇలా కూడా సాధారణ ప్ర‌యాణికుల‌కు లోయ‌ర్ బెర్తులు ల‌భించ‌డం క‌ష్టంగా మారుతుంది. ఈ క్ర‌మంలోనే స్లీప‌ర్ క్లాస్‌లో కోచ్‌కు 6 నుంచి 7 సీట్ల‌ను అలా ఆ కోటాకు కేటాయిస్తామ‌ని అశ్వినీ వైష్ణ‌వ్ తెలిపారు. అదేవిధంగా థ‌ర్డ్ ఏసీలో ఒక కోచ్‌కు 4 నుంచి 5 సీట్ల‌ను, సెకండ్ ఏసీలో ఒక కోచ్‌కు 3 నుంచి 4 సీట్ల‌ను ఆ కోటాకు కేటాయిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ కోటాలో భాగంగా వృద్ధులు, దివ్యాంగులు, గ‌ర్భిణీలు, 45 ఏళ్లు పైబ‌డిన మ‌హిళ‌ల‌కు ముందుగా లోయ‌ర్ బెర్త్‌లు ల‌భిస్తాయ‌ని అన్నారు.

ఈ క్లాస్‌ల‌లోనే చేయాల‌ట‌..

కాగా కేంద్ర మంత్రి మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే రైళ్ల‌లో లోయ‌ర్ బెర్తుల్లో ప్ర‌యాణం చేయాలంటే సెకండ్ ఏసీ లేదా ఫ‌స్ట్ ఏసీలో టిక్కెట్ల‌ను బుక్ చేసుకోవ‌డం మంచిద‌ని కొంద‌రు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక రైళ్ల‌లో ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం అనేక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్న‌ట్లు మంత్రి చెప్పారు. దివ్యాంగుల‌కు ప్యాసింజ‌ర్‌, ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌లోనూ అన్ని సౌక‌ర్యాలు ఉంటాయ‌ని అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement