త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Train | రైలు మిస్ అయితే ఇంకో రైలులో అదే టిక్కెట్‌తో వెళ్ల‌వ‌చ్చా.. రూల్స్ ఏం చెబుతున్నాయి..?

Train | ఇంటి నుంచి ముందుగానే బయలుదేరినా ట్రాఫిక్ లేదా అనుకోని ఆలస్యాల వల్ల ట్రైన్ మిస్ కావడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. ఇలాంటి పరిస్థితుల్లో రీఫండ్ ల‌భిస్తుందా? లేక అదే టికెట్‌తో మరో ట్రైన్‌లో ప్రయాణించవచ్చా? అనే సందేహాలు వ‌స్తుంటాయి.

S

Business | Published On May 2, 2026, 5.15 pm IST

Train | రైలు మిస్ అయితే ఇంకో రైలులో అదే టిక్కెట్‌తో వెళ్ల‌వ‌చ్చా.. రూల్స్ ఏం చెబుతున్నాయి..?
Advertisement

Train | ఇంటి నుంచి ముందుగానే బయలుదేరినా ట్రాఫిక్ లేదా అనుకోని ఆలస్యాల వల్ల ట్రైన్ మిస్ కావడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. ఇలాంటి పరిస్థితుల్లో రీఫండ్ ల‌భిస్తుందా? లేక అదే టికెట్‌తో మరో ట్రైన్‌లో ప్రయాణించవచ్చా? అనే సందేహాలు వ‌స్తుంటాయి. అయితే త్వరగా నిర్ణయం తీసుకునే ముందు భార‌తీయ రైల్వే నిర్దేశించిన నియమాలను తెలుసుకోవడం చాలా అవసరం. జనరల్ (అన్‌రిజర్వ్డ్) టికెట్ ఉన్న ప్రయాణికులకు కొంత సౌలభ్యం ఉంటుంది. టికెట్ చెల్లుబాటు అయ్యేందుకు అదే కేటగిరీకి చెందిన మరో ట్రైన్‌లో ప్రయాణించవచ్చు. సాధారణంగా జనరల్ టికెట్ మూడు గంటల వరకు లేదా తదుపరి అందుబాటులో ఉన్న ట్రైన్ వ‌చ్చే వరకు చెల్లుతుంది. అయితే ఇత‌ర‌ కేటగిరీలో వేరే ట్రైన్‌లో ఎక్కితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఆ ట్రైన్‌ల‌లో చెల్ల‌వు..

జనరల్ టికెట్లు మెయిల్/ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, రాజధాని, శ‌తాబ్ది లేదా వందే భారత్ వంటి ప్రీమియం ట్రైన్‌లలో చెల్లవు. అలాంటి ట్రైన్‌ల‌లో జనరల్ టికెట్‌ల‌తో ప్రయాణిస్తే టీటీఈ దాన్ని చెల్లని టికెట్‌గా పరిగణించి భారీ జరిమానా విధిస్తారు. రిజర్వేషన్ ఉన్న ట్రైన్ మిస్ అయితే అదే టికెట్‌తో మరో ట్రైన్‌లో ప్రయాణించలేరు. అలా చేస్తే టీటీఈ పట్టుకుంటే జరిమానా విధిస్తారు. జరిమానా చెల్లించకపోతే లేదా వాగ్వాదం జరిగితే పరిస్థితి తీవ్రం అవుతుంది. అప్పుడు ప్రయాణికుడిని రైల్వే పోలీసులకు అప్పగించే అవకాశం ఉంటుంది, తద్వారా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు.

ట్రైన్ మిస్ అయితే..

ట్రైన్ మిస్ అయితే వెంటనే టీడీఆర్ (టికెట్ డిపాజిట్ రిసీప్ట్) ఫైల్ చేయాలి. సాధారణంగా ట్రైన్ మిస్ అయినప్పుడు రీఫండ్ ఇవ్వరు. అయితే ట్రైన్ మూడు గంటలకంటే ఎక్కువ ఆలస్యమై, ప్రయాణించకపోతే పూర్తి రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఒక ముఖ్యమైన మినహాయింపు కూడా ఉంటుంది. స్టేషన్‌లో ఎక్కకపోయినా, టీటీఈ సీటును వెంటనే మరొకరికి ఇవ్వలేరు. కనీసం తదుపరి రెండు స్టేషన్ల వరకు సీటు ఖాళీగా ఉంచాలి. అంటే తదుపరి స్టేషన్‌కు చేరుకుని ట్రైన్ ఎక్కగలిగితే, సీటు ఇంకా అందుబాటులోనే ఉంటుంది.

ట్రైన్ మిస్ అయినప్పుడు గందరగోళానికి లోనుకాకుండా, రైల్వే నియమాలను అర్థం చేసుకుని సరైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. ముందుగానే ఈ నిబంధనలు తెలుసుకోవడం ద్వారా అనవసర జరిమానాలు, సమస్యలను నివారించవచ్చు.

Advertisement
Advertisement