Huawei MatePad 11.5 2026 | భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ డిస్‌ప్లేతో లాంచ్ అయిన హువావే మేట్ ప్యాడ్.. ధర ఎంతంటే..
Huawei MatePad 11.5 2026 | హువావే భారత మార్కెట్లో తన కొత్త హువావే మేట్‌ప్యాడ్ 11.5 (2026) ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. గతేడాది పరిచయం చేసిన మోడల్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ ట్యాబ్ ప్రధానంగా ప్రొడక్టివిటీ, నోట్ టేకింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
Technology | Published On Jul 31, 2026, 5.27 pm IST
Huawei MatePad 11.5 2026 | హువావే భారత మార్కెట్లో తన కొత్త హువావే మేట్‌ప్యాడ్ 11.5 (2026) ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. గతేడాది పరిచయం చేసిన మోడల్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ ట్యాబ్ ప్రధానంగా ప్రొడక్టివిటీ, నోట్ టేకింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. పేపర్‌లా అనిపించే డిస్‌ప్లే టెక్నాలజీ, పీసీ స్థాయి మల్టీటాస్కింగ్ ఫీచర్లు, భారీ బ్యాటరీ సామర్థ్యం, స్లిమ్ మెటల్ బాడీ దీని ప్రధాన ఆకర్షణలు. హువావే మేట్‌ప్యాడ్ 11.5 (2026)లో 11.5 ఇంచుల 2.5కె ఫుల్‌వ్యూ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని రిజల్యూషన్ 2456 × 1600 పిక్సల్స్ కాగా, 120 హెడ్జ్ స్మార్ట్ రిఫ్రెష్ రేట్‌ను ఇస్తుంది. అవసరాన్ని బట్టి 60, 90, 120 హెడ్జ్ మధ్య ఆటోమేటిక్‌గా మారుతుంది. గరిష్టంగా 600 నిట్స్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది.
పవర్‌ఫుల్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ..
ఈ ట్యాబ్ లోని పేపర్‌మ్యాట్ ఎడిషన్ ప్రత్యేకంగా నిలిచింది. నానో స్థాయి ఎచింగ్ టెక్నాలజీ, యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్‌తో రూపొందించిన ఈ డిస్‌ప్లే కాంతి ప్రతిబింబాలను గణనీయంగా తగ్గిస్తుంది. కంపెనీ తెలిపిన ప్రకారం.. ఇది 99 శాతం వరకు కాంతి అంతరాయాన్ని తగ్గించడంతోపాటు స్క్రీన్ రిఫ్లెక్షన్‌ను 60 శాతం వరకు తగ్గిస్తుంది. అలాగే టీయూవీ రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ, సర్క్యులర్ పోలరైజేషన్ సర్టిఫికేషన్లతో పాటు ఎస్‌జీఎస్ లో విజువల్ ఫటిగ్ 2.0 ప్రమాణాలను కూడా పొందింది. పూర్తి మెటల్ యూనిబాడీ డిజైన్‌తో రూపొందించిన ఈ ట్యాబ్లెట్ స్పేస్ గ్రే, వయొలెట్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఆక్టాకోర్ కిరిన్ టి82 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీర్ఘకాలం అధిక పనితీరును కొనసాగించేందుకు 67 శాతం పెద్ద గ్రాఫైట్ షీట్‌తో కూడిన కొత్త థర్మల్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. ఇందులో 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. 10,100 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఇది ఒకసారి పూర్తి ఛార్జ్‌తో 14 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. అలాగే 40 వాట్ల హువావే సూపర్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చారు.
ధర ఎంతంటే..
ఈ ట్యాబ్లెట్ హార్మొనీఓఎస్ 4.3 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో సూపర్‌హబ్ ద్వారా డివైస్‌ల మధ్య ఫైల్ షేరింగ్, ఫ్లోటింగ్ విండో, మల్టీ విండో మేనేజ్‌మెంట్ వంటి ప్రొడక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే పీసీ స్థాయి డాక్యుమెంట్ ఎడిటింగ్ కోసం డబ్ల్యూపీఎస్ ఆఫీస్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేశారు. ఈ ట్యాబ్లెట్ మూడో తరం హువావే ఎం పెన్సిల్, హువావే స్మార్ట్ కీబోర్డులకు మద్దతు ఇస్తుంది. ఆడియో కోసం నాలుగు స్పీకర్లు, హువావే హిస్టెన్ 9.0, రెండు మైక్రోఫోన్లు అందించారు. కనెక్టివిటీ పరంగా వైఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ ఉన్నాయి. వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ ఆటో ఫోకస్ కెమెరాను, ముందు భాగంలో వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. హువావే మేట్‌ప్యాడ్ 11.5 (2026) ధరను రూ.43,999గా నిర్ణయించారు. ఈ ట్యాబ్లెట్ ఆగస్టు 7 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభ్యం కానుంది.
తాజావార్తలు
- ●Singareni | థర్మల్ కేంద్రాలకు కొరత లేకుండా సరఫరా చేయాలి : సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్
- ●Parliament | ప్రతిపక్షాల ఆందోళనలతో దద్దరిల్లిన ఉభయసభలు
- ●Doctor N Vani | తెలంగాణ వైద్య విద్యా సంచాలకురాలుగా డాక్టర్ ఎన్ వాణి
- ●Kiara Advani | నాదియా...బోల్డ్ అండ్ బ్యూటీపుల్ - కియారా బర్త్‌డే ట్రీట్ అదుర్స్
- ●Motorola | జేబీఎల్ స్పీకర్లు, పెద్ద డిస్‌ప్లేతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ఫీచర్లు అదుర్స్..
- ●Sanathnagar TIMS | సనత్‌నగర్ టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు.. డైరెక్టర్‌గా నరేంద్ర కుమార్

Singareni | థర్మల్ కేంద్రాలకు కొరత లేకుండా సరఫరా చేయాలి : సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్

Parliament | ప్రతిపక్షాల ఆందోళనలతో దద్దరిల్లిన ఉభయసభలు

Doctor N Vani | తెలంగాణ వైద్య విద్యా సంచాలకురాలుగా డాక్టర్ ఎన్ వాణి

Kiara Advani | నాదియా...బోల్డ్ అండ్ బ్యూటీపుల్ - కియారా బర్త్‌డే ట్రీట్ అదుర్స్



