త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SanDisk Extreme Fit | ప్ర‌పంచంలోనే అత్యంత చిన్న‌దైన 1టీబీ యూఎస్‌బీ-సి ఫ్లాష్ డ్రైవ్‌.. ధ‌ర ఎంతంటే..?

SanDisk Extreme Fit | సాన్‌డిస్క్ భారత మార్కెట్లో కొత్త ఎక్స్‌ట్రీమ్ ఫిట్ యూఎస్‌బీ టైప్ సి ఫ్లాష్ డ్రైవ్ ను లాంచ్‌ చేసింది. ఈ డివైస్ ప్రపంచంలోనే అత్యంత చిన్న 1టీబీ యూఎస్‌బీ టైప్ సి ఫ్లాష్ డ్రైవ్ అని కంపెనీ పేర్కొంది. ల్యాప్‌టాప్‌లు లేదా టాబ్లెట్లకు కనెక్ట్ చేసినప్పటికీ పోర్ట్ చుట్టూ ఎక్కువ స్థలం ఆక్రమించకుండా అదనపు స్టోరేజ్‌ను అందించేందుకు ఈ డివైస్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

S

Technology | Published On Mar 9, 2026, 4.48 pm IST

SanDisk Extreme Fit | ప్ర‌పంచంలోనే అత్యంత చిన్న‌దైన 1టీబీ యూఎస్‌బీ-సి ఫ్లాష్ డ్రైవ్‌.. ధ‌ర ఎంతంటే..?
Advertisement

SanDisk Extreme Fit | సాన్‌డిస్క్ భారత మార్కెట్లో కొత్త ఎక్స్‌ట్రీమ్ ఫిట్ యూఎస్‌బీ టైప్ సి ఫ్లాష్ డ్రైవ్ ను లాంచ్‌ చేసింది. ఈ డివైస్ ప్రపంచంలోనే అత్యంత చిన్న 1టీబీ యూఎస్‌బీ టైప్ సి ఫ్లాష్ డ్రైవ్ అని కంపెనీ పేర్కొంది. ల్యాప్‌టాప్‌లు లేదా టాబ్లెట్లకు కనెక్ట్ చేసినప్పటికీ పోర్ట్ చుట్టూ ఎక్కువ స్థలం ఆక్రమించకుండా అదనపు స్టోరేజ్‌ను అందించేందుకు ఈ డివైస్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫ్లాష్ డ్రైవ్ అల్ట్రా-కాంపాక్ట్ డిజైన్‌తో రూపొందించబడింది, దీని వల్ల వినియోగదారులు దీన్ని ఎప్పటికప్పుడు పోర్ట్‌లో ఉంచుకుని ఉపయోగించుకోవచ్చు. యూఎస్‌బీ టైప్‌-సి కనెక్టర్ ద్వారా ఇది ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఇతర టైప్ సి పరికరాలకు కనెక్ట్ అవుతుంది.

గ‌రిష్ట స్పీడ్ సెక‌నుకు 400ఎంబీ..

128జీబీ నుంచి 1టీబీ వరకు ఉన్న మోడళ్లలో గరిష్టంగా సెకనుకు 400ఎంబీ వరకు రీడ్ స్పీడ్‌ను ఈ డ్రైవ్ అందిస్తుంది. 64జీబీ మోడల్‌లో మాత్రం గరిష్టంగా 300ఎంబీ/సెకండ్‌ వరకు రీడ్ స్పీడ్ లభిస్తుంది. ఫైళ్లను నిర్వహించడం, బ్యాకప్ తీసుకోవడం, పునరుద్ధరించడం కోసం వినియోగదారులు విండోస్‌, మాక్ ప్లాట్‌ఫామ్‌లకు అందుబాటులో ఉన్న సాన్ డిస్క్ మెమొరీ జోన్ యాప్‌ను ఉపయోగించవచ్చు.

ప‌లు స్టోరేజ్ వేరియెంట్ల‌లో విక్ర‌యం..

సాన్ డిస్క్ ఎక్స్‌ట్రీమ్ ఫిట్ యూఎస్‌బీ టైప్ సి ఫ్లాష్ డ్రైవ్ కు యూఎస్‌బీ టైప్ సి క‌నెక్ట‌ర్ వ‌స్తుంది. యూఎస్‌బీ 3.2 జెన్ 1 ఇంట‌ర్‌ఫేస్ ఆధారంగా ప‌నిచేస్తుంది. గ‌రిష్టంగా 400ఎంబీ/సెకండ్ స్పీడ్‌తో రీడ్ చేయ‌గ‌ల‌దు. గ‌రిష్టంగా 1టీబీ స్టోరేజ్ కెపాసిటీ ల‌భిస్తుంది. విండోస్ 10 లేదా ఆపైన ఓఎస్ వెర్ష‌న్‌, మాక్ ఓఎస్ 12 లేదా ఆపైన ఓఎస్ వెర్ష‌న్‌, ఐప్యాడ్ ఓఎస్ 15 లేదా ఆపైన ఓఎస్ వెర్ష‌న్ డివైస్‌ల‌కు ఇది క‌నెక్ట్ అవుతుంది. ఈ ఫ్లాష్ డ్రైవ్‌కు 5 సంవ‌త్స‌రాల ప‌రిమిత వారంటీ ల‌భిస్తుంది. దీన్ని ప్ర‌త్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లోనే విక్ర‌యిస్తున్నారు. 64జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.2,049 ఉండ‌గా, 128జీబీ రూ.2799కి, 256జీబీ రూ.4899, 512జీబీ రూ.4,999, 1టీబీ మోడ‌ల్‌ను రూ.17,299కి ఇస్తున్నారు.

కాంపాక్ట్ లీవ్‌-ఇన్ డిజైన్‌..

ఈ డివైస్ లాంచింగ్ సంద‌ర్భంగా సాన్‌డిస్క్ ఐఎంఈఏ సీనియర్ డైరెక్టర్ (సేల్స్) తారెక్ హుస్సేని మాట్లాడుతూ నేటి కాలంలో విద్యార్థులు నుంచి వృత్తి నిపుణుల వరకు చాలామంది స్లిమ్ ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లను ఉపయోగిస్తున్నారని తెలిపారు. వారి పరికరాలకు అదనంగా ప్రయాణాల్లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా ఉండే స్టోరేజ్ అవసరం ఉందని ఆయన చెప్పారు. వినియోగదారుల మారుతున్న అవసరాలకు అనుగుణంగా సాన్‌డిస్క్ నిరంతరం కొత్త సాంకేతికతలపై దృష్టి పెడుతోందని పేర్కొన్నారు. కాంపాక్ట్ లీవ్-ఇన్ డిజైన్‌తో రూపొందించిన కొత్త సాన్ డిస్క్ ఎక్స్‌ట్రీమ్ ఫిట్ యూఎస్‌బీ టైప్ సి ఫ్లాష్ డ్రైవ్ వేగవంతమైన, అధిక సామర్థ్యమున్న స్టోరేజ్‌ను అందిస్తుందని తెలిపారు. దీనివల్ల వినియోగదారులు ప్రతిసారీ ప్లగ్ చేయడం లేదా తీసేయడం వంటి ఇబ్బందులు లేకుండా, అలాగే క్లౌడ్ సేవలపై ఆధారపడకుండా సులభంగా డేటాను స్టోర్‌ చేసుకోవచ్చని అన్నారు.

Advertisement
Advertisement