FSSAI | నూనె ప్రకటనలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా.. బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు!
FSSAI | వంట నూనెతో కొలెస్ట్రాల్ తగ్గుతుందని, గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ప్రచారం చేస్తున్న సంస్థలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చర్యలకు దిగింది. హైదరాబాద్‌కు చెందిన జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్‌తో పాటు ఆన్లైన్ వాణిజ్య సంస్థలు బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
FSSAI | వంట నూనెతో కొలెస్ట్రాల్ తగ్గుతుందని, గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ప్రచారం చేస్తున్న సంస్థలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చర్యలకు దిగింది. హైదరాబాద్‌కు చెందిన జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్‌తో పాటు ఆన్లైన్ వాణిజ్య సంస్థలు బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘ఫ్రీడమ్ కుకింగ్ రైస్ బ్రాన్ ఆయిల్’ విక్రయాల సందర్భంగా చేసిన ఆరోగ్య ప్రయోజనాల ప్రచారంపై ఈ చర్యలు చేపట్టింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలను వెల్లడించింది. సదరు రైస్ బ్రాన్ ఆయిల్ ప్రకటనల్లో ‘చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను కొనసాగిస్తుంది లేదంటే పెంచుతుంది. 10వేల పీపీఎం కంటే ఎక్కువ న్యాచురల్ ఒరిజనాల్’ వంటి వాదనలు చేసినట్లు గుర్తించింది. అయితే, కొలెస్ట్రాల్, గుండె ఆరోగ్యానికి సంబంధించి ఈ తరహా వాదనలు ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రకటనలు, క్లెయిమ్‌ల నిబంధనలు–2018 ప్రకారం అనుమతించేవి కావని స్పష్టం చేసింది.
ఈ-కామర్స్ లైసెన్స్ లేకుండానే విక్రయాలు
జెమిని ఎడిబుల్స్ తన ఈ-కామర్స్ వెబ్సైట్ ద్వారా ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్నప్పటికీ, ఆ కార్యకలాపాలకు అవసరమైన చెల్లుబాటు అయ్యే కేంద్రం లైసెన్స్ లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో సంబంధిత ఆహార వ్యాపార సంస్థలకు నోటీసులు జారీ చేసి, ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2006 ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై ఇతర సంస్థలపైనా ఎఫ్ఎస్ఎస్ఏఐ చర్యలు చేపట్టింది. తనిఖీల్లో పరిశుభ్రత, పారిశుధ్యం, నిల్వ విధానాలు, లైసెన్సింగ్‌కు సంబంధించి తీవ్రమైన లోపాలు గుర్తించడంతో డీఎన్వీ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసింది. అదేవిధంగా, ఆహార భద్రతా నిబంధనలను పదేపదే ఉల్లంఘించినందుకు ఝవిట్టన్నీ (Jhavittanni) సంస్థ లైసెన్స్‌ను రద్దు చేసింది.
వినియోగదారుల ఆరోగ్యమే లక్ష్యం
ఆహార ఉత్పత్తులపై నిరాధారమైన ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేయడం వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని ఆహార నియంత్రణ సంస్థ పేర్కొంది. సరైన లైసెన్స్ లేకుండా ఆన్లైన్లో ఆహార ఉత్పత్తులను విక్రయించడం కూడా నిబంధనల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. వినియోగదారులకు సురక్షితమైన ఆహార ఉత్పత్తులు అందించడంతోపాటు, వాటిపై వాస్తవమైన సమాచారం మాత్రమే ప్రచారంలో ఉండేలా చూడటమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని తెలిపింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Railway | రాళ్లు రువ్వడం, దొంగతనాలకు చెక్.. రైల్వే ట్రాక్‌లపై నిఘా..!
- ●CM Revanth Reddy | నిమ్జ్‌లో హ్యుందాయ్ ఆర్ అండ్ డీ కేంద్రం
- ●Anirudh | పెళ్లిపీటలు ఎక్కబోతున్న అనిరుధ్ - సీఎం విజయ్‌కి ప్రత్యేక ఆహ్వానం
- ●Twisha Sharma case | తెలుగు నటి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. భోపాల్ కోర్టులో విచారణపై స్టే
- ●Supreme Court | సోషల్ మీడియా ముప్పు నుంచి పిల్లలకు రక్షణ కోరుతూ పిల్.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●OTT Releases | శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలో 30 సినిమాలు రిలీజ్ - ఒక్కోటి ఒక్కో జానర్

Railway | రాళ్లు రువ్వడం, దొంగతనాలకు చెక్.. రైల్వే ట్రాక్‌లపై నిఘా..!

CM Revanth Reddy | నిమ్జ్‌లో హ్యుందాయ్ ఆర్ అండ్ డీ కేంద్రం

Anirudh | పెళ్లిపీటలు ఎక్కబోతున్న అనిరుధ్ - సీఎం విజయ్‌కి ప్రత్యేక ఆహ్వానం

Twisha Sharma case | తెలుగు నటి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. భోపాల్ కోర్టులో విచారణపై స్టే



