త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samsung | ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు శామ్‌సంగ్ బంపర్ ఆఫర్.. పెద్ద సైజు టీవీలపై భారీ డీల్స్..

Samsung | ఫుట్‌బాల్ అభిమానులను లక్ష్యంగా చేసుకుని శామ్‌సంగ్ ఇండియా కొత్త ప్రమోషనల్ క్యాంపెయిన్ బిగ్ గేమ్, బిగ్గర్ స్క్రీన్, బిగ్గెస్ట్ మూమెంట్స్ ను లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా కంపెనీ తన 2026 విజన్ ఏఐ బిగ్ టీవీ శ్రేణిపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది.

S

Technology | Published On Jun 12, 2026, 4.24 pm IST

Samsung | ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు శామ్‌సంగ్ బంపర్ ఆఫర్.. పెద్ద సైజు టీవీలపై భారీ డీల్స్..
Advertisement

Samsung | ఫుట్‌బాల్ అభిమానులను లక్ష్యంగా చేసుకుని శామ్‌సంగ్ ఇండియా కొత్త ప్రమోషనల్ క్యాంపెయిన్ బిగ్ గేమ్, బిగ్గర్ స్క్రీన్, బిగ్గెస్ట్ మూమెంట్స్ ను లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా కంపెనీ తన 2026 విజన్ ఏఐ బిగ్ టీవీ శ్రేణిపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఈ టీవీలలో ఫుట్‌బాల్ మ్యాచ్‌ల వీక్షణ అనుభవాన్ని మరింత మెరుగుపరచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ సాకర్ మోడ్ అందుబాటులో ఉంది. 2026 విజన్ ఏఐ టీవీ లైనప్‌లో స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కలిగించే టెక్నాలజీలను శామ్‌సంగ్ అందించింది. ఏఐ సాకర్ మోడ్ రియల్‌టైమ్ సీన్ అనాలిసిస్ ద్వారా బంతి కదలికలను మరింత స్మూత్‌గా ట్రాక్ చేయడంతోపాటు రంగులను సహజంగా, ఆకర్షణీయంగా చూపిస్తుంది. అలాగే ఆడియోను స్పష్టంగా అందించి మ్యాచ్‌లోని ప్రతి క్షణాన్ని మరింత ఆస్వాదించేందుకు సహాయపడుతుంది.

రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు బెనిఫిట్స్‌..

ఈ టీవీలలో ప్రధాన ఆకర్షణగా శామ్‌సంగ్ విజన్ ఏఐ కంపానియన్ (వీఏసీ) వ్యవస్థను అందించారు. ఇది బిక్స్‌బీ, పర్‌ప్లెక్సిటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ వంటి ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్‌లతో వినియోగదారులకు మరింత వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందిస్తుంది. ఏఐ అప్‌స్కేలింగ్ ప్రో ద్వారా తక్కువ రిజల్యూషన్ కంటెంట్‌ను మెరుగుపరచి మరింత డీటెయిల్, డెప్త్, కాంట్రాస్ట్‌తో చూపిస్తుంది. కలర్ బూస్టర్ ప్రో సన్నివేశానికి అనుగుణంగా రంగులను ఆప్టిమైజ్ చేసి సహజమైన, జీవంతో నిండిన విజువల్స్‌ను అందిస్తుంది. ఏఐ సౌండ్ కంట్రోలర్ ప్రో కామెంటరీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ప్రేక్షకుల హర్షధ్వనుల మధ్య సమతుల్యతను ఆటోమేటిక్‌గా నిర్వహించి ఇమ్మర్సివ్ ఆడియో అనుభూతిని కల్పిస్తుంది. 75 ఇంచులు అంతకంటే పెద్ద స్క్రీన్ సైజ్‌లలోని టీవీల కొనుగోలుపై శామ్‌సంగ్ పలు ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఎంపిక చేసిన మోడల్‌ను బట్టి వినియోగదారులు రూ. 92,990 వరకు విలువైన సౌండ్‌బార్ ను ఉచితంగా పొందే అవకాశం ఉంది. అదే విధంగా రూ. 2,14,990 వరకు విలువైన మరో టెలివిజన్ ను కూడా ఉచితంగా అందిస్తున్నారు.

బ్యాంకు ఆఫ‌ర్లు, ఈఎంఐ స‌దుపాయం..

వినియోగదారుల కొనుగోలు సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శామ్‌సంగ్ పలు స్కీముల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన లావాదేవీలపై 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. జీరో డౌన్ పేమెంట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అలాగే 30 నెలల వరకు ఈఎంఐ చెల్లింపు ఎంపికలను కంపెనీ ప్రవేశపెట్టింది. విజన్ ఏఐ బిగ్ టీవీలను కేవలం టెలివిజన్‌లుగానే కాకుండా భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌లుగా శామ్‌సంగ్ రూపొందించింది. ఈ టీవీలు శామ్‌సంగ్ టీవీ ప్లస్, శామ్‌సంగ్ కేర్ ప్లస్, శామ్‌సంగ్ ఫైనాన్స్ ప్లస్, సౌండ్ ప్లస్, ఆర్ట్ ప్లస్ వంటి సేవలతో అనుసంధానమై ఉంటాయి. అత్యంత ముఖ్యంగా, ఈ టీవీ శ్రేణికి ఏడు సంవత్సరాల ఓఎస్ అప్‌గ్రేడ్ గ్యారంటీని కంపెనీ ప్రకటించింది. దీని వల్ల వినియోగదారులు దీర్ఘకాలం పాటు తాజా సాఫ్ట్‌వేర్ ఫీచర్లను పొందుతారు. ప్రస్తుతం ఈ ప్రత్యేక ఆఫర్లు, కొత్త విజన్ ఏఐ బిగ్ టీవీ శ్రేణి దేశవ్యాప్తంగా ఉన్న శామ్‌సంగ్ రిటైల్ స్టోర్లు, అధీకృత డీలర్‌షిప్‌లు, అధికారిక ఆన్‌లైన్ ఛాన‌ల్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

Advertisement
Advertisement